ఏపీలో మహిళలకు ఫ్రీగా లక్ష పట్టుచీరలు! ఊరూరూ తిరిగి పంచుతున్న బీజేపీ నేత
ఆషాఢ మాసం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు చేపట్టిన "కంబాల కానుక – వనితల వేడుక" కార్యక్రమానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే 40 వేల పట్టుచీరలు పంపిణీ చేయగా, ఆషాఢం చివరి నాటికి లక్షమంది మహిళలకు ఉచితంగా పట్టుచీరలు అందించడమే లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు. దీంతో భారీగా మహిళలు క్యూలు కడుతున్నారు.
చీరలన్నా, నగలన్నా మహిళలకు ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. బీరువానిండా చీరలున్నా.. పట్టుచీరలపై ఆఫర్ పెట్టారు అంటే మహిళలంతా షాపింగ్ మాల్స్‌లోనే ఉంటారు. అందులోనూ వచ్చేది శ్రావణమాసం. నోములు…వ్రతాలు పేరుతో కొత్త చీరలు కొనాల్సిందే. అలాంటప్పుడు పట్టుచీరలు ఫ్రీగా వస్తున్నాయంటే ఆగుతారా.. అందుకే మహిళలకోసం బీజేపీ నేత ఓ వినూత్న కార్యక్రమం ద్వారా మహిళలకు ఉచితంగా పట్టుచీరలు పంపిణీ చేస్తున్నారు. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా లక్షమందికి ఉచితంగా పట్టుచీరలు పంచుతుండటంతో భారీ సంఖ్యలో మహిళలు క్యూ కడుతున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో బిజెపి నేత కంబాల శ్రీనివాసరావు “కంబాల కానుక – వనితల వేడుక” కార్యక్రమం చేపట్టారు. ఆషాఢంలో అమ్మవారి ఆరాధనకు పూనుకునే ప్రతి ఆడపడుచుకు పట్టువస్త్రం అందించడం పుణ్యకార్యమని, కులమతాలకు అతీతంగా ప్రతి మహిళకు గౌరవంగా పట్టుచీర అందిస్తున్నామని కంబాల శ్రీనివాసరావు తెలిపారు. గతంలో లక్కీ డ్రా ద్వారా ఇచ్చేవారమని, కానీ ఈసారి లక్కీ డ్రాతో సంబంధం లేకుండా.. వచ్చిన ప్రతి మహిళకూ నేరుగా పట్టుచీరలు అందజేస్తున్నామని వెల్లడించారు. దీంతో ఉదయం నుంచే మహిళలు భారీగా క్యూకడుతున్నారు. రాజానగరం, గోకవరం, కోరుకొండ, కిర్లంపూడి మండలాల్లోని 30 గ్రామాల్లో ఇప్పటికే 40 వేల చీరల పంపిణీ పూర్తయ్యిందని, రాత్రి 11 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం సాగుతోందని పేర్కొన్నారు. ఆషాఢ మాసం ఆఖరి రోజు నాటికి లక్ష పట్టుచీరలు పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. యేటా పట్టుచీరలు, బంగారు కానుకల పేరుతో కంబాల చేపడుతున్న ఈ భారీ కార్యక్రమాలు స్థానిక రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు
కలెక్టర్ అవుతానని చెప్పి.. ఇలా చేశావేంటి తల్లీ.. ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు..!
సారూ.. మా ఊరికి బస్సెయ్యరూ..! ఆరేళ్ల చిన్నారి విజ్ఞప్తి
విస్తరిస్తున్న ఉపరితల ఆవర్తనం వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు ఆ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్
అయ్యో.. ఇదేం విడ్డూరం.. యువకుడి కడుపులో గర్భాశయం
2027లో ఏం జరగబోతోంది? బాబా వంగ జోస్యం
నది లేదు.. చుక్క వర్షం పడదు.. నిత్యం 3.7 కోట్ల మందికి మంచినీరు
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి

