Neena Gupta: 67ఏళ్ల వయసులో ప్రెగ్నెంటా..? ఇచ్చిపడేసిన ఒకప్పటి హీరోయిన్
సోషల్ మీడియాలో బాడీ షేమింగ్‌కు గురైన బాలీవుడ్ నటి నీనా గుప్తా ట్రోలర్స్‌కు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఓ ఫంక్షన్‌లో చీర కట్టుకున్న సమయంలో పొట్ట కాస్త ఎక్కువగా కనిపించడంతో 67 ఏళ్ల వయసులో గర్భవతి అయ్యారంటూ కొందరు ట్రోల్ చేశారని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని తన టీమ్ చెప్పగా, తాను నవ్వుకున్నానని వెల్లడించారు. అంతేకాదు, తాను నిజంగానే ప్రెగ్నెంట్ అని చెప్పాలంటూ టీమ్‌కు సరదాగా సూచించానని తెలిపారు.
ట్రోల్స్‌కి కాదేది అనర్హం అన్నట్లుగా మారిపోయింది నేటి సోషల్ మీడియా పరిస్థితి. ముఖ్యంగా సినీ తారల విషయంలో ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. వారి సినిమాలు, నటన మాత్రమే కాదు.. నడక, మాట తీరు, శరీరాకృతి, దుస్తులు ఇలా ప్రతీ విషయాన్నీ టార్గెట్ చేస్తూ బాడీ షేమింగ్‌కు దిగుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి నీనా గుప్తా కూడా ఇలాంటి ట్రోలింగ్‌కు గురయ్యారు. చీర కట్టుకున్న సమయంలో ఆమె పొట్ట కాస్త ఎక్కువ కనిపించడంతో గర్భవతి అంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ ఘటనపై తాజాగా స్పందించిన నీనా గుప్తా.. ట్రోలర్స్‌కు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. రీసెంట్ గా నేషన్ మీడియాతో మాట్లాడుతూ.. బాడీ షేమింగ్‌పై నీనా గుప్తా స్పందించారు. ‘ట్రోలింగ్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎలా ఉన్నా ట్రోలింగ్ చేస్తున్నారు. బాడీ షేమింగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆ మధ్య నేను చీరకట్టుకొని ఓ ఫంక్షన్‌కి వెళ్లా. చీర కాస్త బరువుగా ఉండడంతో సర్దుకునే క్రమంలో నా పొట్ట కాస్త లావుగా కనిపించింది. దాంతో 67 ఏళ్ల వయసులో గర్భవతి అయ్యారని ట్రోల్ చేశారంటూ ఆమె ఆవేధన వ్యక్తం చేశారు. ఇవన్నీ తన టీమ్ తన దగ్గరకు తీసుకోచ్చారని.. అయితే వాటిని చూసి తాను నవ్వుకొన్నా అంటూ చెప్పుకొచ్చారు నీనా.. అంతేకాదు తాను నిజంగానే ప్రెగ్నెంట్ అని చెప్పాలంటూ తన టీమ్‌కు ఆమె సరదాగా సూచించారట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Epic: ఎపిక్ సూపర్ కలెక్షన్స్.. డే1 ఎంతంటే?
Hanuman Ansh: త్రివిక్రమ్ తీసుకొస్తున్నారు సరే తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు?
ఏఐతో మానవాళికి పెను ప్రమాదం.. పదేళ్లలో పదిశాతం జన నష్టం?
2027లో ఏం జరగబోతోంది? బాబా వంగ జోస్యం తెలిస్తే వణికిపోవాల్సిందేనా?
ఒక్క నది లేదు.. చుక్క వర్షం పడదు.. అయినా నిత్యం 3.7 కోట్ల మందికి మంచినీరు.. ఎలా?
2027లో ఏం జరగబోతోంది? బాబా వంగ జోస్యం
నది లేదు.. చుక్క వర్షం పడదు.. నిత్యం 3.7 కోట్ల మందికి మంచినీరు
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!

