ఒక్క నది లేదు.. చుక్క వర్షం పడదు.. అయినా నిత్యం 3.7 కోట్ల మందికి మంచినీరు.. ఎలా?
చుట్టూ ఎడారి, వర్షపాతం చాలా తక్కువ.. నదులు కూడా లేని సౌదీ అరేబియాలో కోట్లాది మందికి తాగునీరు ఎలా అందుతోంది? సముద్రపు ఉప్పునీటిని భారీ డీసాలినేషన్ ప్లాంట్లలో శుద్ధి చేసి మంచినీరుగా మార్చుతున్నారు. రివర్స్ ఆస్మోసిస్ ద్వారా ఉప్పును తొలగించి, అవసరమైన ఖనిజాలను కలిపిన తర్వాత వందల కిలోమీటర్ల పైపులైన్ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ భారీ జలవ్యవస్థ ఎడారిలో జీవనాధారంగా నిలుస్తోంది.
ఎటు చూసినా మండే ఇసుక. వర్షం పడేది ఏడాదిలో కొన్నిరోజులే. ఇంక నదులు అసలే లేవు. అయినా 3.7 కోట్ల మందికి నిత్యం ఎలాంటి అంతరాయం లేకుండా తాగునీరు అందుతోంది. ఎటు చూసినా మండే ఎడారి ఉండే ఈ దేశం, సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే అద్భుతమైన జల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీనికోసం తీర ప్రాంతాల్లో భారీ డీసాలినేషన్ ప్లాంట్లను నిర్మించి, సముద్రపు ఉప్పు నీటిని శుద్ధి చేస్తున్నారు. ఈ శుద్ధి ప్రక్రియలో భాగంగా సముద్రపు నీటిని ముందుగా ఫిల్టర్ చేసి, ఆ తర్వాత రివర్స్ ఆస్మోసిస్ విధానం ద్వారా ఉప్పును పూర్తిగా తొలగిస్తారు. అనంతరం నీటిలో కాల్షియం, మెగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాలను కలిపి తాగునీరుగా మారుస్తారు. ఇలా తయారైన నీటిని దేశం లోపలి ప్రాంతాలకు చేరవేయడానికి వందల కిలోమీటర్ల మేర భారీ పైపులైన్ల నెట్‌వర్క్‌ను నిర్మించారు. సుమారు 1.8 మీటర్ల వెడల్పున్న హై-స్ట్రెంగ్త్ కార్బన్ స్టీల్ పైపులను ఉపయోగించి, తుప్పు పట్టకుండా ప్రత్యేక రక్షణ పూత పూసి ఎడారి గుండా ఈ నీటిని తరలిస్తున్నారు. ఇసుక దిబ్బలు, కొండలు, రాళ్లు ఎదురైనప్పటికీ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ భారీ పైపులను అత్యంత వ్యయప్రయాసలతో అమర్చారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం మరియు నిర్వహణకు వందల మిలియన్ డాలర్లు ఖర్చవుతున్నప్పటికీ దేశంలో సహజ మంచినీటి వనరులు లేకపోవడం వల్ల సౌదీ ప్రభుత్వానికి ఇది అత్యంత ప్రాణాధారంగా మారింది. సాంకేతిక పరిజ్ఞానంతో సముద్రాన్ని ఇళ్ల ముందుకు తెచ్చి ఎడారిలో ప్రజల దాహార్తిని తీరుస్తున్న సౌదీ అరేబియా జల ప్రయాణం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైష్ణవితో నిజంగానే లవ్ ఉందా ? అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ
ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం
పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..
విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..
ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!
ఏనుగునైనా చంపే కింగ్ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో తెలుసా
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?

