AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Epic: ఎపిక్‌ సూపర్ కలెక్షన్స్‌.. డే1 ఎంతంటే?

Epic: ఎపిక్‌ సూపర్ కలెక్షన్స్‌.. డే1 ఎంతంటే?

Phani CH
|

Updated on: Sep 13, 2026 | 5:27 PM

Share

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్‌’ సినిమా సెప్టెంబర్‌ 11న థియేటర్లలో విడుదలైంది. #90s వెబ్‌సిరీస్‌లోని బాలుడి పాత్ర పెద్దయ్యాక ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కథతో తెరకెక్కిన ఈ మూవీకి డే1 మంచి వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రీమియర్లతో కలిపి ఇండియాలో రూ.2.10 కోట్ల నెట్‌ రాబట్టినట్లు సమాచారం. ఓవర్సీస్‌తో కలిపి వరల్డ్‌వైడ్‌గా రూ.3.45 కోట్ల గ్రాస్‌ సాధించినట్లు తెలుస్తోంది.

‘బేబి’ సినిమాతో మూడేళ్ల క్రితం హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ ప్రేమకథా మూవీ ‘ఎపిక్’. గతంలో వచ్చిన #90స్ వెబ్ సిరీస్‌లోని పిల్లాడి పాత్రని పెరిగి పెద్దయిన తర్వాత ప్రేమలో పడితే అనే స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. సెప్టెంబరు 11న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి డే1 మంచి కలెక్షన్స్‌ వచ్చాయి. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన ‘ఎపిక్’ సినిమాకు ప్రీమియర్లతో కలిపి ఫస్ట్ డే.. ఇండియాలో రూ.2.10 కోట్ల నెట్ వసూళ్లు రాగా.. ఓవర్సీస్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.3.45 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. పైచదువుల కోసం యూకే వెళ్లిన ఓ తెలంగాణ పల్లెటూరి కుర్రాడు.. ఓ మోడ్రన్ తెలుగమ్మాయితో ప్రేమలో పడితే వాళ్లు ఎంతవరకు హద్దులు దాటేశారు. ఈ క్రమంలోనే ఏమేం తెలుసుకున్నారు? వంటి అంశాలతో ఈ సినిమా తీశారు. ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hanuman Ansh: త్రివిక్రమ్ తీసుకొస్తున్నారు సరే తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు?

ఏఐతో మానవాళికి పెను ప్రమాదం.. పదేళ్లలో పదిశాతం జన నష్టం?

2027లో ఏం జరగబోతోంది? బాబా వంగ జోస్యం తెలిస్తే వణికిపోవాల్సిందేనా?

ఒక్క నది లేదు.. చుక్క వర్షం పడదు.. అయినా నిత్యం 3.7 కోట్ల మందికి మంచినీరు.. ఎలా?

వైష్ణవితో నిజంగానే లవ్ ఉందా ? అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ

Follow Us