AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అల్లు అర్జున్ స్థాయిని పెంచేస్తున్న అభిమానులు..!

Allu Arjun: అల్లు అర్జున్ స్థాయిని పెంచేస్తున్న అభిమానులు..!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 13, 2026 | 8:24 PM

Share

సాధారణంగా సొంత ఇండస్ట్రీలో హిట్లు కొట్టి, ఇతర భాషల్లో విజయాలు సాధించడం హీరోలకు అలవాటు. కానీ దుల్కర్‌ సల్మాన్‌ విషయంలో సీన్‌ రివర్స్‌గా కనిపిస్తోంది. మలయాళంలో ‘కురుప్‌’ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ‘కింగ్‌ ఆఫ్‌ కోత’, ‘ఐమ్‌ గేమ్‌’ నిరాశపరిచాయి. తమిళంలోనూ ఆశించిన విజయాలు దక్కలేదు. ఇదే సమయంలో తెలుగు సినిమాలు ఆయనకు బలంగా నిలుస్తున్నాయి. ‘ఆకాశంలో ఒక తార’, ‘శ్రీ శ్రీ’ సినిమాలపై ఇప్పుడు భారీ ఆశలు ఉన్నాయి.

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కేవలం బాక్సాఫీస్ రికార్డులకే పరిమితం కాకుండా తన ఆర్మీతో కలిసి సామాజిక సేవలోనూ సంచలనాలు సృష్టిస్తున్నారు. సినిమా రిలీజ్‌లు, బర్త్‌డేలకు మాత్రమే పరిమితమయ్యే అభిమాన సంఘాలకు భిన్నంగా AAFA చేస్తున్న ఈ HPVఅవేర్‌నెస్ క్యాంపెయిన్ వెనకున్న అసలు ఉద్దేశం ఏంటి..? సుమారు 8 రాష్ట్రాల్లో బన్నీ అభిమాన సంఘాలు ఏం చేస్తున్నాయి..? వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సామాజిక సేవలో తన వంతు బాధ్యతలో ముందే ఉన్నారు అల్లు అర్జున్. ఆయన అడుగుజాడల్లోనే ఆర్మీ కూడా నడుస్తుంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కేరళ, మహారాష్ట్ర లాంటి 8 విభిన్న ప్రాంతాల్లో 820కి పైగా అవేర్‌నెస్ క్యాంపులు నిర్వహించి శభాష్ అనిపించుకుంటున్నారు. బన్నీ కూడా టైమ్ ఉన్నపుడు అభిమాన సంఘాలను కలుస్తున్నారు. కేవలం సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కాకుండా వాలంటీర్లు నేరుగా క్షేత్ర స్థాయిలోకి వెళ్లి స్కూల్ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ప్రధానంగా ఆడపిల్లలకు HPV వ్యాధి నివారణ, వ్యాక్సినేషన్ ఆవశ్యకతను వివరిస్తూ సరైన వైద్యుల దగ్గరకు వెళ్లేలా గైడెన్స్ ఇస్తున్నారు. ఇలాంటి గ్రాస్‌రూట్ అప్రోచ్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది విద్యార్థినులకు ఈ విలువైన సమాచారాన్ని విజయవంతంగా చేరవేశారు. అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్‌లో పెరుగుతున్న కొద్దీ.. ఫ్యాన్స్ నెట్‌వర్క్ కూడా అంతే బలంగా విస్తరిస్తోంది. ఆ సామూహిక శక్తిని కేవలం సినిమాలకే కాకుండా గొప్ప పనులకు ఉపయోగించడం ప్రశంసనీయం. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులతో బన్నీ పెంచుకున్న అనుబంధానికి, ఆయన సొసైటీ మీద క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌కు ఈ సామాజిక సేవ నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సిబ్బందిపై కారం చల్లి బ్యాంకులో దోపిడీ..

కన్నబిడ్డల పట్ల కర్కశంగా మారుతున్న తల్లిదండ్రులు.. ఎందుకు?

Neena Gupta: 67ఏళ్ల వయసులో ప్రెగ్నెంటా..? ఇచ్చిపడేసిన ఒకప్పటి హీరోయిన్

Epic: ఎపిక్‌ సూపర్ కలెక్షన్స్‌.. డే1 ఎంతంటే?

Hanuman Ansh: త్రివిక్రమ్ తీసుకొస్తున్నారు సరే తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు?

Follow Us