AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్‌!

లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్‌!

Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Sep 12, 2026 | 6:24 PM

Share

మహారాష్ట్ర అమరావతిలో జరిగిన ఓ సాధారణ పెళ్లి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జయస్తంభ్‌ చౌక్‌ వద్ద పార్ధీ సమాజానికి చెందిన ఓ జంట రోడ్డుపైనే సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకుంది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా జరిగిన ఈ పెళ్లిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు. ఈ ఘటనతో పార్ధీ సమాజంలోని కొన్ని కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, మౌలిక వసతుల కొరత మరోసారి చర్చనీయాంశమైంది.

మహారాష్ట్ర అమరావతిలో జరిగిన ఓ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలోని జయస్తంభ్ చౌక్ వద్ద పార్ధీ సమాజానికి చెందిన ఓ జంట రోడ్డుపైనే వివాహం చేసుకున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ పెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది. పార్ధీ సమాజానికి చెందిన పలువురు కుటుంబాలు ఇప్పటికీ సరైన ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు లేకుండా రోడ్ల పక్కన గుడిసెల్లో జీవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఈ జంట తమ పెళ్లిని కూడా చాలా సాధారణంగా చేసుకున్నారు. జయస్తంభ్ చౌక్ వంటి రద్దీ ప్రాంతంలో రోడ్డుపైనే పెళ్లి జరగడంతో అక్కడి ప్రజలు ఆసక్తిగా చూశారు. పెళ్లికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఖరీదైన పెళ్లిళ్లు, భారీ ఏర్పాట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కానీ ఎలాంటి హంగామా లేకుండా రోడ్డుపైనే జరిగిన ఈ పెళ్లి మాత్రం భిన్నంగా నిలిచింది. ఈ పెళ్లి ద్వారా పార్ధీ సమాజం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, మౌలిక వసతుల కొరత మరోసారి చర్చకు వచ్చింది. తక్కువ ఖర్చుతో, తమ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!

పిల్లలకే కాదు.. పెద్దలకూ ఈ టీకాలు చాలా అవసరం

పుట్టగానే పాస్‌పోర్ట్‌.. ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి

హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..

Bigg Boss 10 Telugu News: బిగ్ బాస్‌ 10 – కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్‌

Follow Us