AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలకే కాదు.. పెద్దలకూ ఈ టీకాలు చాలా అవసరం

పిల్లలకే కాదు.. పెద్దలకూ ఈ టీకాలు చాలా అవసరం

Phani CH
|

Updated on: Sep 12, 2026 | 5:53 PM

Share

చిన్నతనంలో టీకాలు తీసుకున్నప్పటికీ పెద్దయ్యాక అన్ని వ్యాధుల నుంచి రక్షణ ఉంటుందని భావించడం సరైంది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వయసు, ఆరోగ్య పరిస్థితులను బట్టి పెద్దలకు కొన్ని టీకాలు అవసరం కావచ్చు. టెటనస్‌ బూస్టర్‌, హెపటైటిస్‌-బి, న్యూమోకోకల్‌, ఇన్‌ఫ్లుయెంజా, హెచ్‌పీవీ, వరిసెల్లా వ్యాక్సిన్లు ఇందులో ముఖ్యమైనవి. పాత టీకాల రికార్డులను పరిశీలించి, వైద్యుల సలహాతో అవసరమైన టీకాలను సకాలంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

చిన్నతనంలో టీకాలు తీసుకున్నాం కదా అని పెద్దయ్యాక అన్ని వ్యాధుల నుంచి రక్షణ ఉంటుందని భావించడం పొరపాటని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ కొన్ని వ్యాక్సిన్ల ప్రభావం తగ్గడంతో పాటు, పెద్దవారు కూడా కొన్ని ప్రత్యేక టీకాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా టెటనస్, హెపటైటిస్-బి, న్యూమోకోకల్, ఇన్‌ఫ్లుయెంజా, హెచ్‌పీవీ ఇకంఆ వరిసెల్లా వంటి వ్యాక్సిన్లు పెద్దలకు ఎంతో ముఖ్యం అంటున్నారు నిపుణులు. టెటనస్ బూస్టర్ డోసులు మిస్ కాకుండా చూసుకోవాలి. అలాగే రక్తం ద్వారా సోకే హెపటైటిస్-బి వ్యాక్సిన్‌ను చిన్నతనంలో పూర్తిగా తీసుకోని వారు డాక్టర్ల సలహాతో అదనపు డోసులు వేయించుకోవడం మంచిది. ఇక వృద్ధుల్లోనూ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో న్యుమోనియా ముప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి న్యూమోకోకల్ వ్యాక్సిన్ తప్పనిసరి. ఫ్లూ వైరస్ ఎప్పటికప్పుడు మారుతుంటుంది కాబట్టి, ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను ప్రతి ఏటా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్యాల నుంచి రక్షణ పొందవచ్చు. కేవలం యుక్తవయసు వారికే కాకుండా, అర్హులైన పెద్దలకు కూడా హెచ్‌పీవీ వ్యాక్సిన్ క్యాన్సర్ల నుంచి రక్షణ ఇస్తుంది. అలాగే చిన్నతనంలో చికెన్‌పాక్స్ రాని పెద్దలకు వరిసెల్లా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి, ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా తీవ్ర సమస్యలను నివారించవచ్చు. మీ పాత వ్యాక్సినేషన్ రికార్డులను ఒకసారి చెక్ చేసుకుని, వైద్యుల సలహా మేరకు అవసరమైన టీకాలను సకాలంలో తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పుట్టగానే పాస్‌పోర్ట్‌.. ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి

హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..

Bigg Boss 10 Telugu News: బిగ్ బాస్‌ 10 – కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్‌

మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?

Mirzapur: మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్‌ దిశగా అడుగులు

Follow Us