Mirzapur: మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘మిర్జాపూర్’ ఇప్పుడు థియేటర్లలోనూ అదే జోరు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, రవి కిషన్ నటించిన ‘మిర్జాపూర్ ది మూవీ’ ఫస్ట్ వీక్‌లో భారీ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆరు రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా దాదాపు రూ.198 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. దీంతో సినిమా రూ.200 కోట్ల క్లబ్‌కు చేరువైనట్లు తెలుస్తోంది.
డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో దుమ్ములేపిన ‘మిర్జాపూర్’ఇపుడు సిల్వర్ స్క్రీన్ పై అదే రేంజ్ లో రచ్చ చేస్తుంది.పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిర్జాపూర్ ది మూవీ’ థియేటర్లలో సాలిడ్ వసూల్లని రాబడుతూ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.సినిమా రిలీజ్ కి ముందే భారీ అంచనాలని మోసిన ఈ సినిమా వాటిని నిజం చేస్తూ ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి నేషనల్ వైడ్ గా రూ.145 కోట్ల నెట్ వసూళ్లని కొల్లగొట్టింది. ఇప్పుడేకంగా 200 కోట్ల వైపు జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. మిర్జాపూర్ ఫస్ట్ డే ఇండియా వైడ్ గా దాదాపు 27 కోట్ల నెట్ రాబట్టిండి. ఇక రెండో రోజు ఏకంగా దాదాపు 33 కోట్లకి పైగా వసూలు చేసి అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఇక మూడో రోజు ఆదివారం కావడం ఈ సినిమాకి బాగా కల్సి వచ్చిందనే చెప్పాలి. దీంతో ఆదివారం ఒక్క రోజే 37 కోట్లకు పైగా భారీ వసూళ్లను రాబట్టింది మిర్జాపూర్ మూవీ. అయితే వీక్ డేస్ లో కలెక్షన్స్ కాస్త నెమ్మదించినప్పటికీ నాలుగో రోజు రూ.17 కోట్లు, ఐదో రోజు రూ.16 కోట్లు, ఆరో రోజు రూ.1౩కోట్లని వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది .ఇక మొత్తంగా ఇండియా వైడ్ గా ఆరు రోజుల్లో ఈ సినిమా దాదాపుగా రూ.140కోట్లకి పైగానే వసూలు చేసినట్టు తెలుస్తుంది .ఇక ఏడో రోజు వచ్చినప్పటికీ కలెక్షన్స్ లో ఎక్కడా డ్రాప్ లేకుండా కోటికీ పైగానే కలెక్షన్స్ రాబట్టి అందర్నీ స్టన్ అయ్యేలా చేసింది మిర్జాపూర్ మూవీ. మరోవైపు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి తొలి ఆరు రోజుల్లోనే దాదాపు రూ.29 కోట్ల గ్రాస్ రావడం అంటే అంత ఆషామాషీ కాదు.ఇక ఇండియా, ఓవర్సీస్ రెండూ కలిపితే ఆరు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా ఏకంగా 198 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అగ్ని పరీక్ష 2 కారణంగా… ప్రభుత్వ ఉద్యోగం పాయే..! పాపం రామకృష్ణ
ఇంటర్ పరీక్షల్లో భారీ మార్పులు!
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్‌నెస్ రహస్యం ఇదే!
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్‌నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్రోడ్లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!

