AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్‌ బాస్‌!

కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్‌ బాస్‌!

Phani CH
|

Updated on: Sep 12, 2026 | 5:21 PM

Share

కంటెంట్‌ పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన 42 ఏళ్ల రాహుల్‌ జూన్‌లో లేఆఫ్స్‌ కారణంగా ఉద్యోగం కోల్పోయారు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులతో పాటు వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రూ.6,000 కరెంట్‌ బిల్లు చెల్లించేందుకు స్నేహితులు, లింక్డ్‌ఇన్‌ ద్వారా సాయం కోరాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఇంటర్వ్యూలకు వెళ్లేందుకు కేవలం రూ.1,000 మాత్రమే మిగిలిందని, కొత్త ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు.

సాధారణంగా రైలు స్టేషన్‌లో ఆగినప్పుడు బంధువులకు లగేజీ లేదా ఇతర వస్తువులు ఇవ్వడం మనం చూస్తుంటాం. కానీ, ఓ వ్యక్తి ఆగకుండా దూసుకెళ్తున్న సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లోకి పార్శిల్‌ను అందించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. పక్కా టైమింగ్‌తో అతడు చేసిన ఈ సాహసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ యూజర్ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రైల్వే ట్రాక్ పక్కన నిలబడిన ఆ వ్యక్తి, వేగంగా దూసుకొస్తున్న రైలులోని ప్రయాణికుల కోచ్‌ల వైపు ఎంతో జాగ్రత్తగా గమనించాడు. సరిగ్గా ఒక డోర్ దగ్గర చేయి ఊపుతున్న వ్యక్తిని గుర్తించిన క్షణంలో.. తన చేతిలోని ప్యాకేజీని ఏమాత్రం తడబడకుండా విసిరాడు. రెప్పపాటు కాలంలో రైలులో ఉన్న వ్యక్తి ఆ ప్యాకేజీని సురక్షితంగా అందుకున్నాడు. ఈ డెలివరీ కోసం వీరిద్దరూ ముందే ఫోన్‌లో మాట్లాడుకుని సమయం, ప్రదేశాన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆ రైలుకు ఆ ప్రాంతంలో హాల్ట్ లేకపోవడం వల్లే తన బంధువుకు కావాల్సిన పార్శిల్‌ను ఇలా వినూత్న పద్ధతిలో అందించాల్సి వచ్చిందని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. కేవలం కొన్ని సెకన్లలో ముగిసిన ఈ డెలివరీ చూసేందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. ఆ వ్యక్తి అద్భుతమైన సమయస్ఫూర్తిని, కచ్చితమైన టైమింగ్‌ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. కానీ ఇలాంటి సాహసాలు మంచివి కావని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!

Follow Us