AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!

అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!

Phani CH
|

Updated on: Sep 12, 2026 | 5:19 PM

Share

కంటెంట్‌ పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన 42 ఏళ్ల రాహుల్‌ జూన్‌లో లేఆఫ్స్‌ కారణంగా ఉద్యోగం కోల్పోయారు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులతో పాటు వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రూ.6,000 కరెంట్‌ బిల్లు చెల్లించేందుకు స్నేహితులు, లింక్డ్‌ఇన్‌ ద్వారా సాయం కోరాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఇంటర్వ్యూలకు వెళ్లేందుకు కేవలం రూ.1,000 మాత్రమే మిగిలిందని, కొత్త ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు.

ఒక వ్యక్తి తన జీవనాధారమైన ఉద్యోగం కోల్పోతే ఎంత మానసిక వేదన పడతాడో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. 2003 నుంచి కంటెంట్ పరిశ్రమలో పనిచేస్తున్న 42 ఏళ్ల రాహుల్, ఈ ఏడాది జూన్‌లో మార్కెట్ రీసెర్చ్ సంస్థల లేఆఫ్స్‌లో భాగంగా తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అప్పటి నుంచి ఆయన జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఆర్థిక ఇబ్బందులతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం పోవడంతో ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని రాహుల్ వాపోయారు. చివరకు తన భార్య కనీసం వంట చేసి పెట్టడానికి కూడా నిరాకరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. 2011లో వివాహమైన నాటి నుంచే దంపతుల మధ్య విభేదాలు ఉండేవని, ఉద్యోగం పోయాక భార్య ప్రవర్తనలో మరింత మార్పు వచ్చిందని ఆయన ఆరోపించాడు. “ఇంట్లో కనీసం వంట చేసుకోవాలన్నా, భోజనం చేయాలన్నా గొడవలు జరగకుండా చాలా జాగ్రత్త పడాల్సి వస్తోంది… వంటగదిని ఒక గూఢచారిలా రహస్యంగా వాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.. భార్య చూడకుండా తినాల్సి వస్తోంది” అని ఆయన తన దీనగాథను వెల్లడించాడు. చేతిలో ఉన్న పొదుపు మొత్తం కరిగిపోవడంతో, చివరికి రూ. 6,000 కరెంట్ బిల్లు కట్టడానికి కూడా స్నేహితులు, లింక్డ్‌ఇన్ ద్వారా సహాయం కోరాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఇంటర్వ్యూలకు వెళ్లేందుకు కేవలం రూ.1,000 మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పిన ఆయన మాటలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ రాహుల్ ఎక్కడా తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. రెండు దశాబ్దాలకు పైగా ఉన్న తన అనుభవంతో కొత్త ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. త్వరలో జరగబోయే ఇంటర్వ్యూపైనే ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఉద్యోగం కనుక వస్తే తన ఆర్థిక కష్టాలతో పాటు వైవాహిక జీవితంలోని సమస్యలు కూడా తొలగిపోతాయని, మళ్లీ జీవితం గాడిన పడుతుందని రాహుల్ ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు

పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!

ఘాట్‌రోడ్‌లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!

ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన

క్రికెట్‌ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం

Follow Us