ఘాట్‌రోడ్‌లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
తిరుపతి జిల్లాలోని రాపూర్ ఘాట్‌లో చిరుత సంచారం వాహనదారులను భయాందోళనకు గురిచేస్తోంది. కొద్ది రోజుల క్రితం సేఫ్టీ వాల్‌పై కనిపించిన చిరుత తాజాగా మరోసారి అదే ప్రాంతంలో ప్రత్యక్షమైంది. దాదాపు అరగంట పాటు వాల్‌పై కూర్చుని ఉండటంతో అటుగా వెళ్లే ప్రయాణికులు భయపడ్డారు. దట్టమైన అటవీ ప్రాంతం మధ్య ఉన్న ఈ ఘాట్ రోడ్డులో రాత్రివేళ ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.
అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. అడవుల్లో దొరకని ఆహారం, నీటికోసం ఇలా రోడ్లపైకి వస్తూ వాహనదారులను, ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరు బోర్డర్ ప్రాంతంలోని చిట్వేలు మండలం రాపూర్ ఘాట్‌లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘాట్ రోడ్డు దట్టమైన అడవి మధ్యలో, సింగిల్ రోడ్డుగా ఉండటంతో ఇక్కడ వన్యప్రాణుల సంచారం సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. గతంలో కోతులు, కనుతులు కనిపించే ఈ మార్గంలో, ఇప్పుడు చిరుపులి తరచూ ప్రత్యక్షమవుతుండటం వాహనదారులను హడలెత్తిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇదే ఘాట్‌లో రాత్రివేళ సేఫ్టీ వాల్‌పై కూర్చుని చిరుత దర్శనమిచ్చింది. తాజాగా మళ్ళీ అదే ప్రదేశంలో ప్రత్యక్షమైన ఆ చిరుత పులి, దాదాపు అరగంట పాటు అక్కడే వాల్‌పై కూర్చుని ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. అటుగా వెళ్తున్న వాహనదారులు చిరుతను చూసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ ఘాట్ రోడ్డుపై ప్రయాణించాలంటేనే జనం గజగజ వణికిపోతున్నారు. అటవీ ప్రాంతాల గుండా వెళ్లే ఈ మార్గంలో ప్రయాణికులు, వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుత కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని, తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
ఘాట్‌రోడ్‌లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!
ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు!
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!

