AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నందనను బిగ్ బాస్ లోకి తీసుకుంటే మర్యాదగా ఉండదు..

నందనను బిగ్ బాస్ లోకి తీసుకుంటే మర్యాదగా ఉండదు..

Phani CH
|

Updated on: Sep 11, 2026 | 7:34 PM

Share

యూట్యూబర్‌ నందూస్‌ వరల్డ్‌ నందన బిగ్‌బాస్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేశారనే ఆరోపణలపై నందన, మధుకర్‌ దంపతులపై కేసు నమోదైన నేపథ్యంలో ఆమె భారత్‌కు రావడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌లోకి తీసుకుంటే ఊరుకోబోమని కాంగ్రెస్‌ నాయకురాలు సంధ్యారెడ్డి హెచ్చరించారు. అయితే నందన నిజంగానే షోలోకి వస్తున్నారా లేదా అనేది ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.

ఇప్పుడు ఏకంగా బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ? యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందన విషయంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు బిగ్ బాస్‌లోకి నందూస్ కనుకవెళితే.. మర్యాదగా ఉండదంటూ కాంగ్రెస్ నాయకురాలు సంధ్యారెడ్డిహెచ్చరికలు జారీ చేయడం కూడా.. ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలతో నందన, మధుకర్ దంపతులపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో నందన అరెస్ట్ కావడం, ఆ తర్వాత పోలీసుల విచారణ కొనసాగుతుండటం తెలిసిందే. ఇప్పటికే నందన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. అయితే తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీన జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే… మరో విషయం ఇప్పుడు ఈ కేసును మరింత హాట్ టాపిక్‌గా మార్చింది.అదే ఉన్నట్టుండి నందన ఇప్పుడెందుకు ఇండియాకు వచ్చారని?. తనపై లుకౌట్ నోటీసులు ఉన్నప్పటికీ నందన ఇండియాకు రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అసలు కేసు ఉన్న విషయం తెలిసినా ఆమె ఎందుకు ఇండియాకు వచ్చారు అనే ప్రశ్నలు అందర్లో ఇంట్రెస్టింగ్‌గా మారియి. అయితే ఉన్నట్టుండి.. ఆమె ఇండియాకు రావడానికి ప్రధాన కారణం బిగ్‌బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని.. ఇప్పుడు ప్రచారం నడుస్తోంది. అయితే ఈ వార్తలను నిజమని నమ్మలేము. అలాగే కొట్టిపారేయలేము. కానీ ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకురాలు సంధ్యారెడ్డి ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. నందనపై ఉన్న ఆరోపణలు, కేసుల నేపథ్యంలో ఆమెను బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకుంటే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అంతేకాదు… బిగ్‌బాస్ టీమ్‌తో పాటు నాగార్జునను కూడా ప్రశ్నిస్తామని సంధ్యారెడ్డి అన్నారు. నిరుద్యోగులను మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఇలాంటి పాపులర్ షోల్లోకి తీసుకురావడం సమాజానికి తప్పుడు సందేశం ఇస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే… నందన నిజంగానే బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం ఇండియాకు వచ్చారా? లేక ఆమె ఇండియాకు రావడానికి మరేదైనా కారణం ఉందా? ప్రస్తుతం ఈ విషయంపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు! వైరల్ అవుతున్న కియారా, సిద్ధార్థ్ కొత్త ఫోటో!

Hyderabad: ఆర్టీసీ నైట్​ సర్వీసులు షురూ – హైదరాబాద్‌లో ఇక 24/7 బస్సులు

Irumudi OTT: గుడ్ న్యూస్ OTTలోకి ఇరుముడి!

Sardar 2: సర్దార్ 2కు బిగ్ షాక్…ఖాళీగా థియేటర్లు!

TOP 9 ET News: కలెక్షన్లా.. చీవాట్లా | మరీ దారుణం600కోట్లు ఖర్చు పెడితే ఎంతొచ్చిందటే?

Follow Us