AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!

రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!

Phani CH
|

Updated on: Sep 11, 2026 | 7:36 PM

Share

ఛత్తీస్‌గఢ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మొబైల్‌లో రీల్స్ చూస్తుండగా ఇంటర్నెట్ సిగ్నల్‌ కట్ కావడంతో మనస్తాపానికి గురైన 52 ఏళ్ల మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కోర్బా జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న విషయాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకోకూడదని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

ప్రస్తుత కాలంలో ప్రాణానికి విలువే లేదా అనిపిస్తోంది. చిన్న చిన్న విషయాలకే కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. మొబైల్ ఫోన్‌లో రీల్స్ చూస్తుండగా ఇంటర్నెట్ సిగ్నల్ కట్ అయిందని మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోర్బా జిల్లాలోని కేరకఛార్ గ్రామానికి చెందిన 52 ఏళ్ల మంగ్లో బాయి సారథికి ఫోన్‌లో రీల్స్, టీవీ సీరియల్స్ చూసే అలవాటు ఉంది. సెప్టెంబరు 5వ తేదీన మధ్యాహ్నం భోజనం చేస్తూ ఆమె మొబైల్‌లో వీడియోలు చూస్తుండగా, నెట్‌వర్క్ సమస్య కారణంగా అవి మధ్యలోనే ఆగిపోయాయి. దాంతో తీవ్ర ఆగ్రహానికి, మనస్తాపానికి గురైన ఆమె తన ఫోన్‌ను నేలకేసి గట్టిగా కొట్టింది. ఆ తర్వాత వెంటనే గదిలోకి వెళ్లి లోపల నుండి తలుపు వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి వాంతులు చేసుకోవడం గమనించిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గదిలో పరిశీలించగా పురుగుల మందు డబ్బా ఖాళీగా కనిపించింది. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కోర్బాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నందనను బిగ్ బాస్ లోకి తీసుకుంటే మర్యాదగా ఉండదు..

ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు! వైరల్ అవుతున్న కియారా, సిద్ధార్థ్ కొత్త ఫోటో!

Hyderabad: ఆర్టీసీ నైట్​ సర్వీసులు షురూ – హైదరాబాద్‌లో ఇక 24/7 బస్సులు

Irumudi OTT: గుడ్ న్యూస్ OTTలోకి ఇరుముడి!

Sardar 2: సర్దార్ 2కు బిగ్ షాక్…ఖాళీగా థియేటర్లు!

Follow Us