ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో చేపల వేటకు వెళ్లిన జాలరికి ఊహించని అదృష్టం కలిసొచ్చింది. జోగులాంబ గద్వాల జిల్లా షేక్‌పల్లి గ్రామానికి చెందిన వినోద్ కృష్ణ వల విసరగా ఏకంగా ఐదు భారీ బొచ్చె చేపలు చిక్కాయి. ఒక్కో చేప సుమారు 30 కిలోల బరువు ఉండటంతో తోటి జాలర్లు ఆశ్చర్యపోయారు. అరుదుగా లభించే ఈ భారీ చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో వినోద్‌కు ఒక్క వేటతోనే భారీ ఆదాయం వచ్చింది.
రోజులాగే వల వేద్దామని చేపలవేటకు వెళ్లిన ఆ జాలరికి కలలో కూడా ఊహించని అదృష్టం తలుపు తట్టింది. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో చేపల వేటకు వెళ్లిన ఓ సాధారణ జాలరికి ఒక్కసారిగా భారీ చేపలు చిక్కి కాసుల వర్షం కురిపించాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం షేక్‌పల్లి గ్రామానికి చెందిన వినోద్ కృష్ణ రోజూ మాదిరిగానే శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో వేటకు వెళ్లాడు. నీటిలో వల విసిరిన కొద్దిసేపటికే వల బరువెక్కిపోయింది. ఏదో పెద్ద చేప పడి ఉంటుందని ఆశతో లాగి చూసిన వినోద్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్పైపోయాడు. అతని వలలో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు భారీ బొచ్చె చేపలు పడ్డాయి. ఒక్కో చేప దాదాపు ముప్పై కిలోల బరువు తూగింది. ఇంతటి భారీ సైజులో ఉండే బొచ్చ చేపలు అరుదుగా దొరుకుతుంటాయి. అలాంటిది ఒకేసారి ఐదు చేపలు చిక్కడం నిజంగా అదృష్టమని తోటి జాలర్లే నోరెళ్లబెట్టారు. అంతేనా.. మార్కెట్లో ఈ భారీ బొచ్చలకు విపరీతమైన డిమాండ్ పలికింది. దీంతో వినోద్ కృష్ణకు ఆశించిన దానికంటే ఎక్కువే ఆదాయం సమకూరింది. ఒక్క వేటతో జాలరి జాక్‌పాట్ కొట్టేశాడని అంతా చర్చించుకున్నారు. ఈ భారీ బొచ్చ చేపలను చూసేందుకు స్థానికులు, తోటి జాలర్లు ఆసక్తి తో ఎగబడ్డడారు. ఈ భారీ చేపల విశేషాలు ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్‌రోడ్‌లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్‌రోడ్‌లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!
ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు!

