Bigg Boss 10 Telugu News: బిగ్ బాస్ 10 – కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
బిగ్‌బాస్ తెలుగు 10లో ‘కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్’ చర్చ రోజురోజుకూ వేడెక్కుతోంది. మాజీ కంటెస్టెంట్ మానస్ నాగులపల్లి సెలబ్రిటీ కంటెస్టెంట్లకు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తూ, ప్రస్తుతం రామ్ ప్రసాద్‌కు ఓటు వేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు హౌస్‌లోనూ రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో కామనర్స్, సెలబ్రిటీల మధ్య విభజనపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ పోరు సీజన్‌కు కీలకంగా మారుతుందా అన్న ఆసక్తి నెలకొంది.
ఇటీవల జియోహాట్‌స్టార్‌లో జరిగిన ‘బిగ్‌బాస్ తెలుగు 24/7 లైవ్ చాట్’లో మాజీ కంటెస్టెంట్ మానస్ నాగులపల్లి సెలబ్రిటీలకు బహిరంగంగా మద్దతు తెలిపాడు. తన ఫేవరెట్ కంటెస్టెంట్లలో దేబ్‌జానీ, రామ్ ప్రసాద్, నరేష్ పేర్లను ప్రస్తావించిన మానస్, ప్రస్తుతం రామ్ ప్రసాద్‌కు ఓటు వేస్తున్నానని చెప్పాడు. అంతేకాదు, తాను సెలబ్రిటీలకే మద్దతుగా ఉన్నానని స్పష్టం చేశాడు. మానస్ వ్యాఖ్యలతో ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారిన ‘కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్’ చర్చ మరింత వేడెక్కింది. హౌస్ బయట సెలబ్రిటీ కంటెస్టెంట్లకు తెలిసినవారి నుంచి వరుసగా మద్దతు లభిస్తుండగా, కామనర్స్ మాత్రం ఒంటరిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. పెరుగుతున్న ఒత్తిడితో వారు తమలో తాము ముడుచుకుపోతున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సెలబ్రిటీలు తమవారికే మద్దతు ఇస్తూ కామనర్స్‌ను ఒంటరి పోరాటానికి వదిలేస్తున్నారా? లేక అండర్‌డాగ్స్‌గా కనిపిస్తున్న కామనర్స్ ఒక్కసారిగా పుంజుకొని ఆటను మలుపు తిప్పుతారా? ఈ విభజన మరింత స్పష్టమవుతున్న నేపథ్యంలో ‘కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్’ ఈ సీజన్‌లోనే అతిపెద్ద పోరుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హౌస్ లో సైతం కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్ అన్నట్లుగానే షో సాగుతుంది. మొదటి రోజు నుంచే అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రోహిత్ పై మాటల దాడి చేస్తున్నాడు త్రిగుణ్. గిన్నెలు సరిగ్గా కడగడం లేదని మాటి మాటికి పిలుస్తూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. దీంతో ఇప్పుడు నెట్టింట కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్ అనే చర్చ మరింత హీటెక్కింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
Mirzapur: మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు
అగ్ని పరీక్ష 2 కారణంగా… ప్రభుత్వ ఉద్యోగం పాయే..! పాపం రామకృష్ణ
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్రోడ్లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!

