AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..

హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..

Phani CH
|

Updated on: Sep 12, 2026 | 5:45 PM

Share

స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ హీరోగా నటించిన ‘డీసీ’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకుంది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విజయంతో సంతోషించిన నిర్మాత కళానిధి మారన్‌ దర్శకుడు లోకేశ్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌, దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్‌కు సరికొత్త బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత సెప్టెంబర్‌ 4 నుంచి సన్‌ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా ఓటీటీలోనూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

ఖైదీ, మాస్టర్, లియో, కూలీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు లోకేశ్ కనగరాజ్. అయితే లోకేశ్ లో మంచి నటుడు కూడా ఉన్నాడు. గతంలో తాను తెరకెక్కించిన పలు సినిమాల్లో క్యామియో రోల్స్ చేసి యాక్టర్ గానూ ఆకట్టుకున్నాడు లోకేశ్. అయితే ఇప్పుడు డీసీ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారిపోయాడు లోకేశ్. రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 07న తెలుగు, తమిళం భాషల్లో రిలీజై సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు సుమారు 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా డీసీ సినిమాకు అరుణ్ మాథేశ్వర్ దర్శకత్వం వహించారు. అలాగే ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఈ క్రమంలో ‘డిసీ’ బ్లాక్‌బస్టర్‌ విజయంతో నిర్మాత కళానిధి మారన్‌ చాలా సంతోషంలో మునిగితేలుతున్నారు. ఈ సందర్భంగా ఆయన దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌, దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్‌లను అభినందించారు. అంతేకాదు వీరికి సరికొత్త బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా అందించి సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ మేరకు కార్ల తాళాలను స్వయంగా అందజేసి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇక డీసీ సినిమా విషయానికి వస్తే ఇదొక రా అండ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్.. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయిన్లు గా నటించారు. అలాగే తలైవాసల్ విజయ్, అవినాష్ రఘు దేవన్, కస్తూరి రాజా, బాలాజీ దేవీ ప్రసాద్, శ్రీకృష్ణ దయాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. కాగా థియేటర్లలో సంచలన విజయం సాధించిన డీసీ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. సెప్టెంబర్ 04 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో టాప్ లో ట్రెండింగ్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss 10 Telugu News: బిగ్ బాస్‌ 10 – కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్‌

మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?

Mirzapur: మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్‌ దిశగా అడుగులు

అగ్ని పరీక్ష 2 కారణంగా… ప్రభుత్వ ఉద్యోగం పాయే..! పాపం రామకృష్ణ

ఇంటర్‌ పరీక్షల్లో భారీ మార్పులు!

Follow Us