AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dulquer Salmaan: విచిత్రమైన పరిస్థితుల్లో దుల్కర్ సల్మాన్

Dulquer Salmaan: విచిత్రమైన పరిస్థితుల్లో దుల్కర్ సల్మాన్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 13, 2026 | 8:27 PM

Share

సాధారణంగా సొంత ఇండస్ట్రీలో హిట్లు కొట్టి, ఇతర భాషల్లో విజయాలు సాధించడం హీరోలకు అలవాటు. కానీ దుల్కర్‌ సల్మాన్‌ విషయంలో సీన్‌ రివర్స్‌గా కనిపిస్తోంది. మలయాళంలో ‘కురుప్‌’ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ‘కింగ్‌ ఆఫ్‌ కోత’, ‘ఐమ్‌ గేమ్‌’ నిరాశపరిచాయి. తమిళంలోనూ ఆశించిన విజయాలు దక్కలేదు. ఇదే సమయంలో తెలుగు సినిమాలు ఆయనకు బలంగా నిలుస్తున్నాయి. ‘ఆకాశంలో ఒక తార’, ‘శ్రీ శ్రీ’ సినిమాలపై ఇప్పుడు భారీ ఆశలు ఉన్నాయి.

సొంత భాషలో హిట్లు కొడుతూ పక్క భాషల్లో సత్తా చాటడం హీరోలకు అలవాటైతే.. దుల్కర్ సల్మాన్ విషయంలో మాత్రం సీన్ ఎందుకు రివర్స్ అవుతోంది..? మాతృభాషలో ఆయనకు కాలం కలిసిరాకపోతే తెలుగు సినిమాలే ఆయన కెరీర్‌కు ఎలా ప్రాణం పోస్తున్నాయి..? భారీ అంచనాల మధ్య వచ్చిన మలయాళ సినిమాలు ఎందుకు నిరాశ పరుస్తున్నాయి..? తేడా ఎక్కడ జరుగుతుంది..? సాధారణంగా ఏ హీరోకైనా సొంత ఇండస్ట్రీ బలం.. అక్కడ హిట్స్ రావడం కామన్. ఆ తర్వాత పక్క ఇండస్ట్రీలో వచ్చే విజయాలు బోనస్. కానీ దుల్కర్ సల్మాన్ విషయంలో మాత్రం విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. కొన్నేళ్లుగా మలయాళంలో ఈయన చేస్తున్న సినిమాలు బోల్తా కొడుతున్నాయి. కరోనా టైమ్‌లో వచ్చిన కురుప్ మాత్రమే మలయాళంలో దుల్కర్‌కు చెప్పుకోదగ్గ హిట్.. ఆ తర్వాత అన్నీ ఫ్లాపులే. కురుప్ తర్వాత మలయాళంలో భారీ అంచనాలతో కింగ్ ఆఫ్ కోత.. రీసెంట్‌గా వచ్చిన ఐమ్ గేమ్ ఆడియన్స్‌ను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. మలయాళంలోనే కాకుండా తమిళంలోనూ దుల్కర్‌కు టైం కలిసిరావట్లేదు. హే సినామిక, కాంతా లాంటి చిత్రాలు కూడా ఫ్లాప్స్ లిస్టులో చేరిపోయాయి. ఇలాంటి టైమ్‌లో మలయాళంలో మార్కెట్ డల్ అయినా.. తెలుగు సినిమాలే దుల్కర్ కెరీర్‌ను కాపాడుతున్నాయి. గీతా ఆర్ట్స్, వైజయంతి సంయుక్త నిర్మాణంలో పవన్ సాదినేని తెరకెక్కిస్తున్న ఆకాశంలో ఒక తార, కొత్త దర్శకుడు రవి నేలకుదిటి రూపొందిస్తున్న శ్రీ శ్రీ సినిమాలతో దుల్కర్ రాబోతున్నారు. ఈ 2 స్ట్రెయిట్ తెలుగు సినిమాలే దుల్కర్‌ కెరీర్‌కు కీలకం. ఇందులో శ్రీ శ్రీ డిసెంబర్ 4న రానుంది. ఇవి హిట్టైతే టాలీవుడ్‌లో ఆయన రేంజ్ మరింత పెరగడం ఖాయం. చూడాలిక ఏం జరగబోతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సిబ్బందిపై కారం చల్లి బ్యాంకులో దోపిడీ..

కన్నబిడ్డల పట్ల కర్కశంగా మారుతున్న తల్లిదండ్రులు.. ఎందుకు?

Neena Gupta: 67ఏళ్ల వయసులో ప్రెగ్నెంటా..? ఇచ్చిపడేసిన ఒకప్పటి హీరోయిన్

Epic: ఎపిక్‌ సూపర్ కలెక్షన్స్‌.. డే1 ఎంతంటే?

Hanuman Ansh: త్రివిక్రమ్ తీసుకొస్తున్నారు సరే తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు?

Follow Us