AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫాదర్ మొమెంట్‌..కన్నబిడ్డను చూసి ఆనందంతో వణికిన తండ్రి చేతులు!

ఫాదర్ మొమెంట్‌..కన్నబిడ్డను చూసి ఆనందంతో వణికిన తండ్రి చేతులు!

Samatha J
|

Updated on: Mar 12, 2026 | 5:03 PM

Share

బిడ్డకు జన్మనివ్వడం తల్లికి ఒక ఎత్తైతే, ఆ పసి ప్రాణాన్ని మొదటిసారి చేతుల్లోకి తీసుకోవడం తండ్రికి ఓ తీపి జ్ఞాపకం లాంటిది. ఆ సమయంలో కలిగే భావోద్వేగం మాటలకు అందనిది. తాజాగా ఓ తండ్రి తన బిడ్డను తొలిసారి చూసి ఉద్వేగానికి గురైన వీడియో నెట్టింట వైరల్ అవుతూ అందరి కళ్ళను తడిచేస్తోంది. చెన్నైకి చెందిన గైనకాలజిస్ట్‌ డాక్టర్ సుగన్య శరవణకుమార్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఆపరేషన్ రూమ్ బయట ఆందోళనగా వేచి చూస్తున్న తండ్రికి, అప్పుడే పుట్టిన పసికందును డాక్టర్ అప్పగించారు. బిడ్డను చూడగానే ఆ తండ్రి ఆనందంతో కంగారు పడటం నెటిజన్‌లను ఆకట్టుకుంది. ఆ చిన్నారిని ఎలా ఎత్తుకోవాలో తెలియక, ఎక్కడ నలిగిపోతుందో అన్న భయంతో అతని చేతులు వణకడం అందరినీ కదిలించింది. తర్వాత డాక్టర్ ధైర్యం చెప్పి, బిడ్డను ఎలా పట్టుకోవాలో నేర్పించిన తర్వాతే ఆ తండ్రి కుదుటపడ్డాడు. తండ్రి ప్రేమలోని లాలిత్యాన్ని, బిడ్డ పట్ల బాధ్యతను చాటిచెప్పే ఆ మధుర క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఫాదర్ మొమెంట్‌.. ప్రపంచంలోని అత్యంత బలవంతుడైనా.. తన బిడ్డను మొదటిసారి ఎత్తుకునేటప్పుడు ఆ చేతులు వణకాల్సిందే!’ అంటూ డాక్టర్ సుగన్య ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే రికార్డులు సృష్టించింది. ఇప్పటి వరకు 20 కోట్ల వ్యూస్‌కు పైనే సాధించింది. నెటిజన్‌లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘తండ్రి ప్రేమలోని స్వచ్ఛతకు ఇది నిదర్శనం’ అని ఒకరు, ‘ఒక తండ్రికి తన బిడ్డ కంటే విలువైన నిధి ప్రపంచంలో మరొకటి ఉండదు’ అని మరొకరు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ‘నాకు ఫస్ట్ పుట్టిన బేబీని ఎత్తుకున్నప్పుడు ఇలానే ఉద్వేగానికి లోనయ్యాను.. అని చాలా మంది కామెంట్ల రూపంలో తెలియజేశారు.

మరిన్ని వీడియోల కోసం :

ప్రకృతి ఒడిలో అరుదైన దృశ్యం..జంటపాముల సయ్యాట!

భాగ్యనగరంలో హోటళ్లకు కట్టెల పొయ్యిలే దిక్కా!

ప్రపంచానికి ‘చమురు’గండం.. ఆగ్నేయాసియాలో ఎనర్జీ ఎమర్జెన్సీ!

మరణం సైతం విడదీయలేని మహా బంధం!

మళ్లీ పెళ్లికి రెడీ అయిన మాజీమంత్రి మల్లారెడ్డి

Follow Us