ప్రపంచానికి ‘చమురు’గండం.. ఆగ్నేయాసియాలో ఎనర్జీ ఎమర్జెన్సీ!
ఇరాన్ - అమెరికా - ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు పశ్చిమాసియా సరిహద్దులు దాటి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ చమురు సరఫరా వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడంతో, ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం, థాయ్‌లాండ్ 'ఇంధన అత్యవసర పరిస్థితి' ప్రకటించే స్థాయికి చేరుకున్నాయి.
వియత్నాంలో పరిస్థితి ఊహకందని విధంగా మారుతోంది. కేవలం రెండు వారాల్లోనే పెట్రోల్ ధరలు 32 శాతం పెరగ్గా, డీజిల్, కిరోసిన్ ధరలు ఏకంగా 56 నుండి 80 శాతం వరకు ఎగబాకాయి. రాజధాని హనోయి వీధుల్లో పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ మిన్ స్వయంగా కువైట్, ఖతార్ దేశాలతో మంతనాలు జరుపుతున్నారు. రవాణా ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఇవ్వాలని అక్కడి యంత్రాంగం నిర్ణయించింది.థాయ్‌లాండ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి సంచలన ఆంక్షలు విధించింది. ఇంధన పొదుపు కోసం వారానికి కేవలం 4 రోజులు మాత్రమే పనిదినాలను అమలు చేస్తోంది. అత్యవసర సేవలు మినహా మిగిలిన సిబ్బంది ఇంటి నుండే విధులు నిర్వర్తించాలని సూచించింది. సొంత వాహనాలను పక్కన పెట్టి, సైకిళ్లు లేదా ప్రజా రవాణాను వాడాలని పౌరులకు విజ్ఞప్తి చేసింది. అధికారుల విదేశీ పర్యటనలపై నిషేధం విధించడంతో పాటు, ‘కార్‌పూలింగ్’ను తప్పనిసరి చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు అదుపులోకి వచ్చే వరకు ఈ ‘యుద్ధ ప్రాతిపదిక’ చర్యలు తప్పవని ఇరు దేశాలు స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
స్పిరిట్ కథలో అవే హైలైట్స్ !
గ్లోబల్ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్
ఉస్తాద్ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

