గుజరాత్లో చాందీపూర్ వైరస్ కలకలం రేపుతోంది, 22 మరణాలు, 187 అనుమానిత కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా 15 ఏళ్ల లోపు పిల్లలు దీని బారిన పడుతున్నారు. జ్వరం, వాంతులు, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 24-48 గంటల్లో ప్రాణాపాయం. వ్యాక్సిన్ లేదు, వెంటనే చికిత్స అవశ్యం. ఈగలు, నల్ల దోమలు ఈ వైరస్ వ్యాప్తికి కారణం.