మత మార్పిడి ద్వారా రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు, మతం మారిన వ్యక్తులకు పుట్టుకతో వచ్చే కుల ధ్రువపత్రాలు వర్తించవని తేల్చి చెప్పింది. తమిళనాడులో పరమశివం అనే వ్యక్తి కేసు ఆధారంగా ఈ తీర్పు వెలువడింది.