AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్‌ ధనికుల ఆదాయం చాలా తక్కువని తెలుసా

అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్‌ ధనికుల ఆదాయం చాలా తక్కువని తెలుసా

Phani CH
|

Updated on: Oct 15, 2026 | 7:02 PM

Share

ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, భారత ధనికుల ఆదాయం అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలోని పేదల ఆదాయం కంటే చాలా తక్కువ. భారత్ ఆర్థికంగా పురోగమిస్తున్నా, సగటు మనిషి ఆదాయ స్థాయి మాత్రం వెనుకబడి ఉంది. ఈ ఆదాయ వ్యత్యాసం తగ్గడానికి పేదల, మధ్యతరగతి వర్గాల ఆదాయాలు పెరగాలని నిపుణులు సూచిస్తున్నారు.

భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలుస్తున్నప్పటికీ, ఈ వృద్ధి ఫలాలు సగటు పౌరుడికి, ముఖ్యంగా అత్యధిక ఆదాయ వర్గాలకు కూడా చేరడం లేదని ప్రపంచ బ్యాంకు నివేదిక స్పష్టం చేసింది. షాకింగ్ విషయమేమిటంటే, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని అత్యల్ప ఆదాయ వర్గాల (పేదల) సంపాదన, భారత్‌లోని సంపన్న వర్గాల ఆదాయం కంటే చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన పావర్టీ అండ్ ఇనీక్వాలిటీ ప్లాట్‌ఫామ్ గణాంకాలు ఈ ఆదాయ వ్యత్యాసాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. ఈ నివేదిక ప్రకారం, భారత్‌లో నెలకు లక్ష రూపాయలు సంపాదించిన వారిని మంచి ఆదాయం ఉన్నవారిగా పరిగణిస్తారు. అయితే, ప్రపంచంలోని సంపన్న దేశాలతో పోలిస్తే, భారత సగటు మనిషి ఆదాయం ఏ మాత్రం ఆకర్షణీయంగా లేదని ప్రపంచ బ్యాంకు విశ్లేషిస్తోంది. వివరాల్లోకి వెళ్తే, అమెరికాలో అత్యల్ప ఆదాయ వర్గానికి చెందిన వ్యక్తి రోజుకు సగటున 25 డాలర్లు సంపాదిస్తుండగా, భారత్‌లో అత్యధిక ఆదాయం పొందుతున్న వర్గాల రోజువారీ ఆదాయం కేవలం 10 డాలర్ల వద్దే ఆగిపోయింది. అంటే, అమెరికాలోని ఒక బిచ్చగాడి రోజువారీ ఆదాయం భారత సంపన్న వర్గాల ఆదాయం కంటే రెండింతలున్నది. ఈ అంతరం కేవలం అమెరికాకే పరిమితం కాదు. కెనడాలో అత్యల్ప ఆదాయ వర్గం రోజుకు 31 డాలర్లు, జర్మనీ, ఆస్ట్రేలియాలో 28 డాలర్లు, ఫ్రాన్స్, బ్రిటన్‌లలో 26 డాలర్లుగా వారి ఆదాయాలు నమోదయ్యాయి. ఈ గణాంకాలు అభివృద్ధి చెందిన దేశాలలోని అత్యల్ప ఆదాయ వర్గాల జీవన ప్రమాణాలు భారత సంపన్నుల కంటే మెరుగ్గా ఉన్నాయని సూచిస్తున్నాయి. జపాన్‌లో అత్యల్ప ఆదాయ వర్గం రోజుకు 18 డాలర్ల స్థాయిలో ఉండగా, ఇది కూడా భారత్ ధనికుల ఆదాయం కంటే ఎక్కువ. అత్యధిక ఆదాయ వర్గాల విషయానికి వస్తే, అంతర్జాతీయ స్థాయిలో భారత్ మరింత వెనుకబడి ఉంది. అమెరికాలో అత్యధిక ఆదాయ వర్గం రోజుకు 173 డాలర్లు సంపాదిస్తుండగా, కెనడా, ఆస్ట్రేలియాలో 129 డాలర్లు, జర్మనీలో 108 డాలర్లు, ఫ్రాన్స్‌లో 109 డాలర్లు, బ్రిటన్‌లో 110 డాలర్లు, ఇటలీలో 100 డాలర్లుగా నమోదైంది. జపాన్‌లో అత్యధిక ఆదాయ వర్గం రోజుకు 83 డాలర్లు ఆర్జిస్తుండగా, మన భారత్ సంపన్నుల ఆదాయం మాత్రం కేవలం 10 డాలర్ల రేంజ్‌లోనే నిలిచిపోయింది. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, బంగ్లాదేశ్ వంటి దేశం కూడా ఆదాయంలో భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌లో అత్యల్ప వర్గం ఆదాయం 3 డాలర్లు కాగా, సంపన్నుల ఆదాయం 13 డాలర్లుగా నమోదైంది. అంటే, బంగ్లాదేశ్ ధనికులు భారత ధనికుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని స్పష్టమవుతోంది. భారత్ ఆర్థికంగా దూసుకుపోతున్నప్పటికీ, దేశ ఆర్థిక వృద్ధికి, ప్రజల వ్యక్తిగత ఆదాయ స్థాయిలకి మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఈ గణాంకాలు నొక్కి చెబుతున్నాయి. ఈ అంతరాన్ని తగ్గించాలంటే దేశంలో పేదల, మధ్యతరగతి వర్గాల ఆదాయాలు పెరగాలి. వ్యాపారాలు విస్తరించాలి, ఉత్పాదకత పెరగాలి. అప్పుడే ఆర్థిక వృద్ధి ఫలాలు దేశంలోని సామాన్య ప్రజలకు చేరి, వారి జీవితాల్లో నిజమైన మార్పు వస్తుంది. దేశ స్థూల ఆర్థిక గణాంకాలు పెరిగినా, కుటుంబాల ఆదాయాలు అదే స్థాయిలో పెరగకపోతే అభివృద్ధి సామాన్యుడికి పూర్తి స్థాయిలో చేరదన్న వాస్తవాన్ని ప్రపంచ బ్యాంకు నివేదిక మరోసారి గుర్తు చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌–విజయవాడ హైవేకు మహర్దశ! ఆరు లైన్ల పనులకు ముహూర్తం ఫిక్స్!

విమానంలో షాకింగ్‌ ఘటన.. ఫ్లైట్‌ అటెండెంట్‌ను కొరికిన నటి

అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

రెస్టారెంట్ల వంటగదుల్లో నిఘా కళ్లు.. అక్కడ వండితే ఇక్కడ కస్టమర్‌కి క్లియర్‌గా కనిపించేలా..

అరె.. ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది.. మోకు లేకుండానే చకచకా చెట్టెక్కేసాడు!

Follow Us