AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెస్టారెంట్ల వంటగదుల్లో నిఘా కళ్లు.. అక్కడ వండితే ఇక్కడ కస్టమర్‌కి క్లియర్‌గా కనిపించేలా..

రెస్టారెంట్ల వంటగదుల్లో నిఘా కళ్లు.. అక్కడ వండితే ఇక్కడ కస్టమర్‌కి క్లియర్‌గా కనిపించేలా..

Phani CH
|

Updated on: Oct 15, 2026 | 4:11 PM

Share

తెలంగాణలో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు అధికారులు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వంటగదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఫుడ్ సేఫ్టీ హైజీన్ రేటింగ్‌ ధ్రువపత్రం కలిగి ఉండాలని సూచించారు. హానికారక రంగులు, నిషేధిత పచ్చి గుడ్డు మయోనైజ్‌ వాడకూడదని హెచ్చరించినట్లు కథనం చెబుతోంది. నెల రోజుల్లోగా కెమెరాల ఏర్పాటుకు రెస్టారెంట్‌ అసోసియేషన్‌ అంగీకరించినట్లు సమాచారం.

ప్రస్తుతం కాలంలో ఏది చూసినా కల్తీనే! హోటల్‌లో భోజనం చేయాలంటేనే ఎక్కడో ఒక చిన్న భయం. మనం ఇష్టపడి ఆర్డర్ చేసే ఫుడ్‌ను వంటగదిలో ఎంత శుచిగా, శుభ్రంగా తయారు చేశారో? ఏ కల్తీ పదార్థాలు కలిపారో? లేక కుళ్లిన పదార్థాలతో వంట చేశారో అసలు ఏమీ తెలియదు. రెస్టారెంట్‌లోకి వెళ్లగానే మనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని, వేడివేడిగా ప్లేట్‌లోకి రాగానే ఆవురావురు మంటూ లాగిస్తుంటాం. కానీ, ఆ తర్వాత కడుపునొప్పి, వాంతులు అయ్యి ఫుడ్‌ పాయిజన్‌తో ఆస్పత్రుల పాలవుతున్న ఘటనలు రోజూ చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం బయట ఆహారం తినాలంటేనే జనాలు గడగడలాడిపోతున్నారు. ఇలాంటి భయాలకు, అపరిశుభ్రతకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. వినియోగదారుల ఆరోగ్యమే లక్ష్యంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతను మరింత మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇప్పటివరకు రెస్టారెంట్లలో తయారైన ఆహారాన్ని టేబుల్‌పై కూర్చుని తినడం మాత్రమే మనకు తెలుసు. కానీ, ఇకపై వంటగదిలో ఆహారం ఎలా సిద్ధమవుతుందో, ఏ పదార్థాలు వాడుతున్నారో కస్టమర్లు నేరుగా తెలుసుకునేలా సరికొత్త వెసులుబాటు రానుంది. ఇందుకోసం రెస్టారెంట్ల కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు టీజీ సేఫ్ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో రెస్టారెంట్‌ అసోసియేషన్‌ సభ్యులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు. వంటగదుల పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ, వంటకు ఉపయోగించే ముడి పదార్థాల నాణ్యత వంటి అంశాలపై అధికారులు పలు సూచనలు చేశారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఫుడ్ ప్రిపరేషన్‌పై పారదర్శకత పెరుగుతుందని, వినియోగదారుల్లో హోటళ్లపై నమ్మకం రెట్టింపు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. కేవలం సీసీ కెమెరాల ఏర్పాటు మాత్రమే కాకుండా, హోటల్ నిర్వహణలో కొన్ని కఠినమైన నిబంధనలను పాటించాలని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ప్రతి రెస్టారెంట్ తప్పనిసరిగా హైజీన్ రేటింగ్‌తో కూడిన భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ ధ్రువపత్రాన్ని కలిగి ఉండాలి. ఆహార పదార్థాల్లో ఎలాంటి హానికారక రంగులను ఉపయోగించడానికి వీల్లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నిషేధిత పచ్చి గుడ్డుతో తయారయ్యే మయోనైజ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించే రెస్టారెంట్లను ఉపేక్షించేది లేదని, అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. అధికారుల ఆదేశాలపై సానుకూలంగా స్పందించిన రెస్టారెంట్‌ అసోసియేషన్‌ సభ్యులు.. రాబోయే నెల రోజుల్లోగా అన్ని రెస్టారెంట్ల వంటగదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వంటగదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆహార తయారీ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్నది పర్యవేక్షించడంతో పాటు, వినియోగదారుల్లో రెస్టారెంట్లపై నమ్మకాన్ని పెంచేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని సూచించారు. అయితే కెమెరాల ఏర్పాటుతో పాటు వంటగదులను నిత్యం శుభ్రంగా ఉంచడం, ఆహార పదార్థాలను సురక్షితంగా నిల్వ చేయడం, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం కూడా అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరె.. ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది.. మోకు లేకుండానే చకచకా చెట్టెక్కేసాడు!

మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం.. పరిశోధనలో షాకింగ్ విషయాలు!

దారం లాంటి ఈ చేపలను అంత ఇష్టంగా ఎందుకు తింటారు.. చీరమేను అసలు సీక్రెట్స్ ఇవే..

రైలు ప్రయాణంలో డైపర్లు అయిపోయాయా? డోంట్ వర్రీ!

ChatGPT లో కీలక మార్పు.. ఇక చాట్‌లోనే గేమ్స్, కాలిక్యులేటర్లు!

Follow Us