AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలు ప్రయాణంలో డైపర్లు అయిపోయాయా? డోంట్ వర్రీ!

రైలు ప్రయాణంలో డైపర్లు అయిపోయాయా? డోంట్ వర్రీ!

Phani CH
|

Updated on: Oct 15, 2026 | 3:56 PM

Share

ఆరు నెలల బాబుతో రైలులో ప్రయాణిస్తున్న దేబీ ప్రసాద్‌కు డైపర్లు అయిపోవడంతో ఇబ్బంది ఎదురైంది. వెంటనే ఆయన రైల్‌మదద్‌ ద్వారా ఉదయం 10:07 గంటలకు ఫిర్యాదు చేశారు. కేవలం 10 నిమిషాల్లోనే రైల్వే సిబ్బంది స్పందించి, గయా జంక్షన్‌లో చిన్నారికి డైపర్లు అందించారు. ఈ సేవకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన సోషల్‌ మీడియాలో తన అనుభవాన్ని పంచుకున్నారు. రైల్వే సిబ్బంది వేగవంతమైన స్పందనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

చిన్న పిల్లలతో సుదీర్ఘ రైలు ప్రయాణం చేయడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. ముఖ్యంగా ప్రయాణంలో అనుకోకుండా పసిపాప డైపర్లు అయిపోతే ఆ తల్లిదండ్రుల అవస్థలు వర్ణనాతీతం. సరిగ్గా అలాంటి క్లిష్ట పరిస్థితినే ఎదుర్కొన్న ఒక కుటుంబానికి భారతీయ రైల్వే అండగా నిలిచి, డిజిటల్ సేవల సమర్థతను చాటిచెప్పింది. దేబీ ప్రసాద్ అనే ప్రయాణికుడు తన ఆరు నెలల బాబుతో కలిసి రైలులో ప్రయాణిస్తున్న సమయంలో అనుకోకుండా చిన్నారి డైపర్లు అయిపోయాయి. ఏం చేయాలో తోచని స్థితిలో ఆయన వెంటనే భారతీయ రైల్వే అధికారిక ఫిర్యాదు వేదిక అయిన ‘RailMadad’ పోర్టల్ ద్వారా ఉదయం 10:07 గంటలకు తన సమస్యను విన్నవించుకున్నారు. ఫిర్యాదు చేసిన కేవలం 10 నిమిషాల్లోనే రైల్ మదద్ బృందం, ప్యాంట్రీ కార్ మేనేజర్ ఆయనను సంప్రదించారు. “కంగారు పడకండి, తర్వాతి స్టేషన్‌లోనే మీకు డైపర్లు అందజేస్తాం” అని భరోసానిచ్చారు. వారు చెప్పినట్లే తదుపరి రైల్వే స్టేషన్ అయిన ‘గయా జంక్షన్’ రాగానే రైల్వే సిబ్బంది వచ్చి ప్రయాణికుడికి బేబీ డైపర్లను సమయానికి అందజేశారు. రైల్వే శాఖ అందించిన వేగవంతమైన సేవలకు సంతోషించిన ఆయన, ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఇండియన్ రైల్వేస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఉచితంగా పొందడం కోసం ఫిర్యాదు చేశారంటూ వచ్చిన కొన్ని విమర్శలపై దేబీ ప్రసాద్ స్పందిస్తూ.. తగినన్ని డైపర్లు తెచ్చుకున్నా అనుకోకుండా అయిపోయాయని, ఆ డైపర్లకు అయ్యే డబ్బులను తన సొంత సొమ్ము నుంచే చెల్లించానని స్పష్టం చేశారు. రైల్వే డిజిటల్ సేవల వేగానికి, ప్రయాణికుల పట్ల సిబ్బంది చూపిన బాధ్యతాయుతమైన వైఖరికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ChatGPT లో కీలక మార్పు.. ఇక చాట్‌లోనే గేమ్స్, కాలిక్యులేటర్లు!

Follow Us