AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

Phani CH
|

Updated on: Oct 15, 2026 | 4:14 PM

Share

భూదాన్‌ పోచంపల్లికి చెందిన చేనేత కళాకారుడు బోగ బాలయ్య అరటి నారతో వినూత్న ఇక్కత్‌ వస్త్రాన్ని రూపొందించారు. కాటన్‌ దారంతో పాటు అరటి కాండం నుంచి తీసిన నారను ఉపయోగించి ప్రత్యేక డిజైన్‌లో ఈ వస్త్రాన్ని నేశారు. నాలుగు పెడల్స్‌, నాలుగు అచ్చులతో సాగిన ఈ ప్రయోగానికి నెల రోజుల సమయం పట్టింది. పర్యావరణహిత రంగులతో రూపొందించిన ఈ వస్త్రం చేనేత రంగంలో కొత్త అవకాశాలకు దారితీస్తుందని భావిస్తున్నారు.

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు, మగువలు మెచ్చే పట్టు చీరలకు నిలయం భూదాన్ పోచంపల్లి. యంత్రాలు వేగంగా వస్త్రాలను తయారుచేస్తున్న ఈ ఆధునిక కాలంలోనూ, తమ సృజనాత్మకతతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఇక్కడి చేనేత కళాకారులు. ఈ క్రమంలోనే పోచంపల్లికి చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు బోగ బాలయ్య చేనేత రంగానికి కొత్త కళ తెచ్చేలా మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా కాటన్, సిల్క్ దారాలతో ఇక్కత్ వస్త్రాలు నేస్తుంటారు. కానీ, బాలయ్య అరటి చెట్టు కాండం పొరల నుంచి తీసిన నారను వస్త్ర తయారీకి వినియోగించారు. సాధారణంగా మగ్గంపై రెండు పెడల్స్‌తో నేత నేస్తే, ఈ ప్రత్యేక వస్త్రం కోసం ఆయన నాలుగు పెడల్స్, నాలుగు అచ్చులను ఉపయోగించారు. నిలువునా కాటన్ దారాన్ని, అడ్డంగా కోయంబత్తూర్ నుంచి తెప్పించిన అరటి నార దారాన్ని ఉపయోగిస్తూ ఇక్కత్ డిజైన్‌లో అద్భుతమైన వస్త్రాన్ని రూపొందించారు. ఈ అరటి-కాటన్ మిశ్రమ వస్త్రం మృదువుగా ఉండటమే కాకుండా, కాంతివంతంగా ఉంటూ అస్సలు ముడత పడదని ఆయన తెలిపారు. ఈ వస్త్రాల తయారీలో పర్యావరణహిత రంగులనే ఉపయోగించామని, ఇవి శరీరానికి చల్లదనాన్ని ఇస్తూ, చెమటను త్వరగా పీల్చుకుంటాయని బాలయ్య చెప్పారు. ఈ మొదటి ప్రయోగాత్మక వస్త్రాన్ని తయారు చేసేందుకు ఆయనకు నెల రోజుల సమయం పట్టింది. తన ఇంటినే రీసెర్చ్ సెంటర్‌గా మార్చుకుని కొత్త ప్రయోగాలు చేసే బాలయ్య, గతంలో పదివేల రంగుల షేడ్స్‌తో శాలువాపై ఇండియా మ్యాప్‌ను నేసి ‘సంత కబీర్’ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రకృతి సిద్ధమైన సహజ వనరులతో ఆయన చేపడుతున్న ఈ కొత్త ప్రయోగాలు చేనేత రంగానికి సరికొత్త దారులు చూపిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెస్టారెంట్ల వంటగదుల్లో నిఘా కళ్లు.. అక్కడ వండితే ఇక్కడ కస్టమర్‌కి క్లియర్‌గా కనిపించేలా..

అరె.. ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది.. మోకు లేకుండానే చకచకా చెట్టెక్కేసాడు!

మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం.. పరిశోధనలో షాకింగ్ విషయాలు!

దారం లాంటి ఈ చేపలను అంత ఇష్టంగా ఎందుకు తింటారు.. చీరమేను అసలు సీక్రెట్స్ ఇవే..

రైలు ప్రయాణంలో డైపర్లు అయిపోయాయా? డోంట్ వర్రీ!

Follow Us