AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అర్జున్ టెండూల్కర్ ప్రీ-వెడ్డింగ్ పార్టీలో శుభ్మన్ గిల్ డ్యాన్స్.. వీడియో చూశారా?

Shubman Gill dance video: వైరల్ వీడియోలో బాలీవుడ్ సూపర్‌హిట్ సినిమా “జబ్ వి మెట్”లోని పాపులర్ సాంగ్ “మౌజా హీ మౌజా”కు గిల్ అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నాడు. అతని పంజాబీ స్వాగ్, కాన్ఫిడెంట్ డాన్స్ మూవ్స్ పార్టీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Viral Video: అర్జున్ టెండూల్కర్ ప్రీ-వెడ్డింగ్ పార్టీలో శుభ్మన్ గిల్ డ్యాన్స్.. వీడియో చూశారా?
Shubman Gill Dance Video
Venkata Chari
|

Updated on: Feb 18, 2026 | 12:46 PM

Share

Shubman Gill dance video: క్రికెట్ సీజన్ జోరుగా సాగుతుండగా, టీమిండియా ఆటగాళ్లు టీ20 వరల్డ్ కప్‌ను మరోసారి గెలుచుకోవాలనే లక్ష్యంతో దూసుకెళ్తున్నారు. ఇదే సమయంలో భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి వేడుకల్లో సరదాగా కనిపించాడు. ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరుగుతుండగా, అనేక మంది భారత క్రికెట్ దిగ్గజాలు హాజరయ్యారు. ఈ వేడుకల్లో “జగ్ సారా జగ్ సారా బిఖర్ గయా” పాటకు గిల్ ఉత్సాహంగా డాన్స్ చేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వన్డే, టెస్టు కెప్టెన్‌గా ఉన్న శుభ్మన్ గిల్ ఈ వేడుకల్లో పూర్తిగా ఫన్ మూడ్‌లో ఉన్నట్టు కనిపించాడు. అర్జున్ టెండూల్కర్ ప్రీ-వెడ్డింగ్‌లో సంప్రదాయ బ్రౌన్ బంద్‌గలా సూట్‌తో పాటు మెడలో స్టైలిష్ మఫ్లర్ ధరించి ఆయన స్టైలిష్ లుక్‌లో మెరిశాడు.

ఈ డాన్స్ వీడియోపై ఫ్యాన్స్ భారీగా ప్రశంసలు కురిపిస్తున్నారు. మైదానంలో బ్యాట్‌తోనే కాదు, డాన్స్ ఫ్లోర్‌పై కూడా గిల్ “200 స్ట్రైక్ రేట్”తో పెర్ఫార్మ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో సరదా కామెంట్స్ చేస్తున్నారు. అయితే, కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ వీడియో గిల్‌కు దగ్గరి బంధువు పెళ్లికి సంబంధించినదని చెబుతున్నారు. అయినప్పటికీ, ఇంటర్నెట్‌లో ఇది అర్జున్ టెండూల్కర్ ప్రీ-వెడ్డింగ్ వీడియోగా విస్తృతంగా వైరల్ అవుతోంది.

అర్జున్ టెండూల్కర్ ఎవరిని వివాహం చేసుకోబోతున్నాడు?

క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండూల్కర్ ఇంట త్వరలో పెళ్లి సందడి మొదలుకానుంది. అర్జున్ టెండూల్కర్ తన లాంగ్‌టైమ్ పార్ట్నర్, బిజినెస్ టైకూన్ రవి ఘై మనవరాలు సానియా చండోక్‌ను 2026 మార్చి 5న ముంబైలో వివాహం చేసుకోనున్నాడు.

సానియా చండోక్ విజయవంతమైన వ్యాపారవేత్త. ఆమె కుటుంబం ప్రముఖ క్వాలిటీ ఐస్‌క్రీమ్ బ్రాండ్లు, బాస్కిన్ రాబిన్స్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో అనుబంధం కలిగి ఉందని సమాచారం. ఇటీవల టెండూల్కర్ కుటుంబం జామ్‌నగర్‌లో జరిగిన ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో అంబానీ కుటుంబంతో కలిసి పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయి.

అర్జున్ టెండూల్కర్ పెళ్లికి కోహ్లీ కూడా హాజరు..?

అర్జున్, సానియా వివాహ వేడుకకు హై-ప్రొఫైల్ అతిథుల జాబితా ఉండనుందని సమాచారం. సచిన్ టెండూల్కర్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోం మంత్రి అమిత్ షాలను ఆహ్వానించారని వార్తలు వినిపిస్తున్నాయి.

క్రీడా రంగం నుంచి విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్ వంటి దిగ్గజాలు హాజరయ్యే అవకాశముంది. సోషల్ మీడియాలో అభిమానులు ఇప్పుడు గిల్, విరాట్ కోహ్లీ ఇద్దరూ కలిసి డాన్స్ ఫ్లోర్‌పై కనిపిస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలా జరిగితే ఆ వీడియో ఇంటర్నెట్ రికార్డులన్నీ బ్రేక్ చేసే అవకాశముంది.

అర్జున్ టెండూల్కర్‌కు 2026 చాలా కీలకమైన సంవత్సరం. పెళ్లితో పాటు, ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us