రైల్లో రీల్స్ రచ్చ..ప్రయాణికుడి వీడియో వైరల్
రైలు ప్రయాణం కొత్త వారిని పరిచయం చేస్తుంది. ఒక్కోసారి చేదు అనుభవాలు తప్పవు. గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి భయంకరమై అనుభవం ఎదురైంది. చివరికి రైల్వే హెల్ప్ లైన్‌కి కాల్ చేసేంతగా ఆయన ఓపిక నశించింది. ప్రయాణికుడు పోస్ట్ చేసిన వీడియో నెట్టింట సివిక్ సెన్స్‌పై చర్చకు దారి తీసింది. తన ప్రయాణాన్ని "లైవ్ రియాలిటీ షో"గా మార్చేసారని చెబుతూ అతను వీడియో పోస్ట్ చేశారు.
తన బోగీలో 20 నుంచి 30 మంది సభ్యుల కుటుంబం కూడా చేరిందనీ రైలు ఎక్కింది మొదలు ఒకటే గోల. అరుపులు, కేకలు, పాటలతో హోరెత్తించారనీ మన్మోహన్ వర్మ పోస్ట్‌లో తెలిపారు. డ్యాన్స్ చేస్తూ రీల్స్‌తో రచ్చ రచ్చ చేశారనీ ఇతర ప్రయాణీకుల అసౌకర్యాన్ని అస్సలు పట్టించుకోకుండా, వారి ప్రశాంతతకు భంగం కలిగిస్తూ గంటల తరబడి ఇలా నానా యాగీ చేశారనీ రాసుకొచ్చారు. దాంతో చిర్రెత్తు కొచ్చిన అతను రైల్వే హెల్ప్‌లైన్‌కు 139కి ఫిర్యాదు చేసారట. రైల్వే పోలీసులు వచ్చి వారికి వార్నింగ్ ఇచ్చారని తెలిపారు. ‘‘రైల్వే కోచ్ అనేది పబ్లిక్ ప్లేస్. మన సొంత స్థలం కాదు.. దురదృష్టవశాత్తు కొంతమంది ప్రయాణీకుల్లో కనీస సివిక్ సెన్స్ కరువైందంటూ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. రైలు కోచ్ ఒక ప్రైవేట్ లివింగ్ రూమ్ కాదు రీల్-మేకింగ్ సెట్ అంతకన్నా కాదన్నారు. పెద్ద శబ్దాలు చేయకుండా కనీస మర్యాదతో మెలగాలి. తోటి ప్రయాణీకులను గౌరవించాలి. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. అపుడు మాత్రమే ప్రయాణం ఆనందంగా ఉంటుందంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :
ప్రకృతి ఒడిలో అరుదైన దృశ్యం..జంటపాముల సయ్యాట!
భాగ్యనగరంలో హోటళ్లకు కట్టెల పొయ్యిలే దిక్కా!
ప్రపంచానికి ‘చమురు’గండం.. ఆగ్నేయాసియాలో ఎనర్జీ ఎమర్జెన్సీ!
మరణం సైతం విడదీయలేని మహా బంధం!
మళ్లీ పెళ్లికి రెడీ అయిన మాజీమంత్రి మల్లారెడ్డి
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

