అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి శ్రీ సాంబమూర్తి ఆలయ గర్భగుడిలో నాగుపాము ప్రత్యక్షమవడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. పూజారి గర్భగుడి తలుపులు తెరిచిన సమయంలో శివలింగం సమీపంలో ప్రశాంతంగా కనిపించిన నాగును భక్తులు శివుడి మహిమగా భావించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అదే సమయంలో ఆలయ కమిటీ పాముకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని పురాతన సాంబమూర్తి ఆలయంలో అరుదైన, ఆధ్యాత్మిక అద్భుతం చోటుచేసుకుంది. సాక్షాత్తు ఆ పరమశివుడి ఆభరణమైన నాగుపాము ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమవడంతో భక్తులు ఒకింత భయాందోళనకు గురైనా.. అది శివయ్య లీల అని ఆధ్యాత్మిక ఆనందానికి లోనయ్యారు. ప్రతిరోజూ లాగే నిత్యపూజలు నిర్వహించేందుకు ఆలయ అర్చకులు గర్భగుడిలోకి వెళ్లగా, అక్కడ నాగదేవత విగ్రహాల ముందే ఈ నాగుపాము ప్రశాంతంగా కూర్చుని కనిపించింది. గర్భగుడిలో నాగుపామును చూసిన పూజారి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే, ఆ సర్పరాజం ఎలాంటి హాని తలపెట్టకుండా నిశ్శబ్దంగా, ధ్యాన ముద్రలో ఉన్నట్లు కూర్చోవడంతో అది దైవ లీలగా భావించి ఆలయ నిర్వాహకులకు సమాచారం అందించారు. ఈ వార్త క్షణాల్లో దావానలంలా వ్యాపించింది. దీంతో రచ్చపల్లితో పాటు పరిసర ప్రాంతాల నుండి పెద్దసంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. శివనామ స్మరణతో సాంబమూర్తి ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. భక్తులంతా సాక్షాత్తు ఆ దేవుడి మహిమగా భావించి, నాగుపాముకు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ అరుదైన దృశ్యాన్ని దర్శించుకోవడం ఒక గొప్ప శుభసూచకమని భక్తులు నమ్ముతున్నారు. అదే సమయంలో, ఆ వన్యప్రాణికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫోన్‌లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్‌లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి
ఆ గ్రామంలో వరుస మరణాలు.. భయంతో స్థానికులు ఏం చేశారంటే!
కోడలికి కొత్త జీవితం ఇచ్చిన మామ! నువ్వు సూపర్..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

