వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
బెంగళూరులో ఓ మహిళ ఇంటికి పార్సిల్ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ ఏజెంట్ వాష్‌రూమ్ ఉపయోగిస్తానని చెప్పి బలవంతంగా లోపలికి ప్రవేశించిన అనంతరం అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు సమయస్ఫూర్తితో వీడియో రికార్డ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనపై స్పందించిన ఫ్లిప్‌కార్ట్ అతడిని విధుల నుంచి తొలగించి, కస్టమర్ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించింది.
బయటకు వెళ్తేనే కాదు.. ఇంట్లో ఉన్నా మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. అందుకు మరో ఉదాహరణే బెంగళూరులో జరిగిన ఈ ఘటన. వాష్‌రూమ్‌కి వెళ్లాలంటూ వచ్చిన డెలివరీ బోయ్ లోపలికి ప్రవేశించి ప్రవర్తించిన తీరు ఆ ఇంటి మహిళను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఐటీ హబ్ బెంగళూరులో శనివారం సాయంత్రం మున్నెకోలాలలోని ఒక అపార్ట్‌మెంట్‌కు విజయ్ మల్లికార్జున్ కామత్ అనే డెలివరీ బాయ్ పార్సిల్ ఇవ్వడానికి వెళ్లాడు. మహిళకు ఆర్డర్ అందించిన అనంతరం, తనకు అర్జెంట్ అని వాష్‌రూమ్ వాడుకుంటానని కోరాడని తెలిపింది. అయితే..తాను అపరిచితులను లోపలికి అనుమతించనని చెప్పినా వినకుండా బలవంతంగా లోపలికి ప్రవేశించినట్టు మహిళ వెల్లడించింది. అనంతరం బాత్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆ కామాంధుడు ఒక్కసారిగా ఆమె ముందు అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఆ దారుణాన్ని చూసి మొదట షాకైనప్పటికీ, ఆ మహిళ ధైర్యం కోల్పోకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించింది. వెంటనే తన మొబైల్ ఫోన్ తీసి ఆ డెలివరీ బాయ్ వికృత చేష్టలను వీడియో రికార్డ్ చేసింది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కస్టమర్ల భద్రత విషయంలో రాజీ పడేదే లేదని స్పష్టం చేస్తూ, సదరు డెలివరీ బాయ్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించింది. అపరిచితులను ఇంట్లోకి రానిచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన హెచ్చరిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. ప్రభుత్వ పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. అకౌంట్లో బ్యాలెన్స్ చూసి షాక్!
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

