AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. అకౌంట్లో బ్యాలెన్స్‌ చూసి షాక్‌!

పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. అకౌంట్లో బ్యాలెన్స్‌ చూసి షాక్‌!

Phani CH
|

Updated on: Jul 15, 2026 | 8:44 PM

Share

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన 82 ఏళ్ల పెన్షనర్ కమేశ్వర్ మిశ్రా ఖాతాలో ఒక్కసారిగా రూ.759 కోట్లకు పైగా బ్యాలెన్స్ కనిపించడం కలకలం రేపింది. ఆయన వికలాంగ కుమారుడి ఖాతాలోనూ భారీ మొత్తం కనిపించింది. కొద్ది నిమిషాల్లోనే ఆ మొత్తం మాయమవడంతో ఇది సాంకేతిక లోపమని భావిస్తున్నారు. ఘటనపై బ్యాంకు అధికారులు విచారణ ప్రారంభించగా, అసలు కారణం వెలుగులోకి రావాల్సి ఉంది.

సాధారణంగా సామాన్యుల బ్యాంకు ఖాతాల్లో వందల్లో..వేలల్లో బ్యాలెన్స్‌ ఉంటుంది. లేదంటూ ఓ లక్షా..లక్షన్నర ఉండే ఛాన్స్‌ ఉంటుంది. కానీ వృద్ధాప్య పెన్షన్‌పై ఆధారపడి బ్రతికే ఓ వృద్ధుడి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చూస్తే మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే.. వింటున్న మనకే కాదు.. ఆ వృద్ధుడి పరిస్థితీ అదే. తన ఎకౌంట్‌లో కోట్లాదిరూపాయల బ్యాలెన్స్‌ చూసిన ఆ వృద్ధుడికి నిజంగానే మైండ్‌ బ్లాంక్‌ అయింది. ఈసంఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. ముజఫర్‌పూర్‌కు చెందిన 82 ఏళ్ల కామేశ్వర్ మిశ్రా ఒక కవి. ఆయన తన వృద్ధాప్య పెన్షన్ డబ్బులను విత్‌డ్రా చేసుకునేందుకు, వికలాంగుడైన తన కుమారుడితో కలిసి స్థానిక కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లారు. పెన్షన్ డబ్బులు తీసుకున్న తర్వాత మిశ్రా సరదాగా తన అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయమని ఆపరేటర్‌ను కోరారు. స్క్రీన్‌పై బ్యాలెన్స్ చూడగానే అక్కడ ఉన్నవారంతా షాకయ్యారు. ఆయన ఖాతాలో ఏకంగా రూ. 759,69,51,951 నగదు ఉన్నట్టు చూపించింది. ఆశ్చర్యపోయిన ఆ వృద్ధుడు..ఓసారి తన కుమారుడి ఎకౌంట్‌ కూడా చెక్‌చేయమని కోరాడు. అందులోనూ దాదాపు అంతే మొత్తంలో డబ్బు ఉన్నట్లు తేలింది. తండ్రీకొడుకుల ఖాతాల్లో కలిపి ఏకంగా రూ. 1,500 కోట్లకు పైగా బ్యాలెన్స్ చూపించడంతో ఆ కుటుంబంతో పాటు సీఎస్‌సీ ఆపరేటర్ కూడా షాక్‌కు గురయ్యారు. ఈ విషయంపై కమేశ్వర్ మిశ్రా స్పందిస్తూ.. తన ఖాతాలోకి ఇంత భారీ మొత్తం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని, బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగిన సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగి ఉండవచ్చని అన్నారు. దీనిపై బ్యాంకు అధికారులు వెంటనే విచారణ జరిపి పొరపాటును సరిదిద్దాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

కదులుతున్న రైలులో పూజ‌లు.. రైల్వే అధికారుల రియాక్షన్‌ ఇదే!

పోలీసువైనంత మాత్రాన చట్టం నీ చుట్టం కాదు బాస్‌!

Vijay Deverakonda: అభిమానికి విజయ్‌ దేవరకొండ అభయం!

ఈఎంటీ సాహసం.. అంబులెన్స్‌లోనే ప్రసవం.. తర్వాత!

Follow Us