AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: అభిమానికి విజయ్‌ దేవరకొండ అభయం!

Vijay Deverakonda: అభిమానికి విజయ్‌ దేవరకొండ అభయం!

Phani CH
|

Updated on: Jul 15, 2026 | 8:37 PM

Share

టీజీ20 లీగ్ ఫైనల్ సందర్భంగా విజయ్ దేవరకొండను కలిసిన ఓ యువ క్రికెటర్ తన ఆర్థిక ఇబ్బందుల వల్ల క్రికెట్ కల నెరవేరడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. అతడిని ఓదార్చిన విజయ్, “నీకు నేనున్నాను” అంటూ పూర్తి ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ భావోద్వేగ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, విజయ్ మానవత్వాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కేవలం తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకున్నారు. తాజాగా జరిగిన టీజీ20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండను చూసి, ఒక యువ అభిమాని భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నాడు. భవిష్యత్తులో గొప్ప క్రికెటర్‌గా రాణించాలనేది తన కల అని, అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ కల నెరవేరడం లేదంటూ ఆ యువకుడు విజయ్ ముందు తన ఆవేదనను పంచుకున్నాడు. ఆ యువకుడి మాటలు, కన్నీళ్లు విజయ్ దేవరకొండ మనసును కరిగించాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ అభిమానిని దగ్గరకు తీసుకుని, ఓదారుస్తూ.. “నీకు నేనున్నాను, బాధపడకు” అంటూ కొండంత అభయాన్ని ఇచ్చారు. ఆ యువకుడు క్రికెట్‌లో రాణించడానికి అవసరమైన పూర్తి ఆర్థిక సహాయాన్ని అందిస్తానని, ఆటలో ముందడుగు వేయడానికి తన వంతుగా తోడ్పాటు అందిస్తానని విజయ్ దేవరకొండ బహిరంగంగా హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు విజయ్ దేవరకొండ మంచి మనసుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గతంలోనూ ఆయన ‘దేవరశాంటా’ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ఎంతోమంది పేదలకు, విద్యార్థులకు సహాయం చేసి తన సేవాగుణాన్ని చాటుకున్నారు. ఇప్పుడు మరోసారి ఒక సామాన్య యువకుడి క్రికెట్ కలకు రెక్కలు తొడుగుతూ విజయ్ తీసుకున్న నిర్ణయం అందరి హృదయాలను గెలుచుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈఎంటీ సాహసం.. అంబులెన్స్‌లోనే ప్రసవం.. తర్వాత!

అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో

ఫోన్‌లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి!

ఆ గ్రామంలో వరుస మరణాలు.. భయంతో స్థానికులు ఏం చేశారంటే!

కోడలికి కొత్త జీవితం ఇచ్చిన మామ! నువ్వు సూపర్‌..

Follow Us