ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. ప్రభుత్వ పాఠశాల ఆశ్చర్యకర గాథ!
వరంగల్ జిల్లా వర్ధన్నపేట సమీపంలోని కోనాపురం ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఒక్క విద్యార్థి మాత్రమే చదువుతున్నాడు. అతని కోసం ఒక ఉపాధ్యాయుడు, వంట మనిషి, పనిమనిషి విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఉపాధి లేక కుటుంబాలు వలస వెళ్లడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఒక్క విద్యార్థి కోసం ప్రభుత్వం నెలకు సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేస్తుండగా, ఈ పాఠశాల పరిస్థితి చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందన్నది పాత వార్తే .. కానీ, ఇటీవల కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా విద్యార్ధులు సత్తా చాటుతున్నారు. అందుకే తల్లిదండ్రులు కూడా క్యూలో నిలబడి మరీ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కోసం పడిగాపులు కాచిన దాఖలాలూ లేకపోలేదు. కానీ వరంగల్ జిల్లాలోని ఒక పాఠశాల పరిస్థితి మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ పరిధిలోని కోనాపురం ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఒకే ఒక విద్యార్థి చదువుకుంటున్నాడు. ఆ ఒక్క విద్యార్థి కోసమే ఒక ఉపాధ్యాయుడు, ఒక వంట మనిషి, ఒక పనిమనిషి.. ఇలా ముగ్గురు విధులు నిర్వహిస్తున్నారు! ఈ పాఠశాలలో 2వ తరగతి తెలుగు మీడియం చదువుతున్న ఈరెల్లి విక్కీపాల్ అనే బాలుడే ఆ ఏకైక విద్యార్థి. గత ఐదేళ్లుగా ఇక్కడే పని చేస్తున్న ఏకైక పాధ్యాయుడు జగన్మోహన్ రావుకు ఇప్పుడు ఈ బాలుడే సర్వస్వం. తన ఉద్యోగం నిలబడాలంటే ఈ విక్కీపాల్ బడికి రావడం అత్యవసరం. అందుకే బాలుడు ఎప్పుడైనా బడికి రానని మారాం చేస్తే, పంతులు గారే స్వయంగా వాళ్లింటికి వెళ్లి, బ్రతిమిలాడి బడికి తీసుకువస్తుంటారు. ఐదేళ్ల క్రితం ఇక్కడ 20 మంది విద్యార్థులు ఉండేవారు. కానీ, స్థానికంగా ఉపాధి లేక తల్లిదండ్రులు పట్టణాలకు వలస వెళ్లడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. గత ఏడాది ముగ్గురు మిగలగా, ఈ ఏడాదికి విక్కీపాల్ ఒక్కడే మిగిలాడు. ఈ ఒక్క విద్యార్థి మధ్యాహ్న భోజనం, పాఠశాల నిర్వహణ కోసం ప్రభుత్వం నెలకు దాదాపు లక్ష రూపాయలు ఖర్చు చేస్తోంది. ఉపాధి అవకాశాలు మెరుగుపడితేనే ఈ పాఠశాల మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. అకౌంట్లో బ్యాలెన్స్ చూసి షాక్!
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి
ఆ గ్రామంలో వరుస మరణాలు.. భయంతో స్థానికులు ఏం చేశారంటే!

