దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి, ఇది వాతావరణ మార్పుల వల్ల వచ్చే సాధారణ జ్వరంగా భావించడం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.