పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో ఓ వివాహిత తన పదేళ్లలోపు ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ విషాదానికి దారితీసిన అసలు కారణాలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.