అస్సాంలోని టిన్సుకియా పట్టణం బహిరంగ మూత్ర విసర్జనకు అడ్డుకట్ట వేయడానికి ఒక వినూత్న ప్రణాళికను అమలు చేస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసే వారి ఫోటోలు, వీడియోలను మున్సిపాలిటీ కార్యాలయం ముందున్న భారీ ఎల్ఈడీ తెరలపై ప్రదర్శిస్తారు. ప్రజల ఫిర్యాదుల మేరకు మున్సిపల్ అధికారి నయన్ జ్యోతి నాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు పబ్లిక్ టాయిలెట్స్‌ను ఉపయోగించాలని కోరారు.