AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGRJC CET 2026 Notification: ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ఇంగ్లిష్‌ మీడియం అడ్మిషన్లకు.. టీజీఆర్‌జేసీ సెట్‌ 2026 నోటిఫికేషన్ విడుదల

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎమ్‌ఈసీ గ్రూపుల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌ (ఇంగ్లిష్‌ మీడియం) ప్రవేశాల కోసం టీజీఆర్‌జేసీ సెట్‌- 2026 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ గురుకుల..

TGRJC CET 2026 Notification: ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ఇంగ్లిష్‌ మీడియం అడ్మిషన్లకు.. టీజీఆర్‌జేసీ సెట్‌ 2026 నోటిఫికేషన్ విడుదల
TGRJC CET Admission Notification
Srilakshmi C
|

Updated on: Mar 13, 2026 | 6:53 AM

Share

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎమ్‌ఈసీ గ్రూపుల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌ (ఇంగ్లిష్‌ మీడియం) ప్రవేశాల కోసం టీజీఆర్‌జేసీ సెట్‌- 2026 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (TREIS) ప్రకటన వెలువరించింది. టీజీఆర్‌జేసీ సెట్‌ 2026 ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని మొత్తం 35 గురుకులాల్లో ఇంగ్లీషు మీడియంలో ప్రవేశం పొందవచ్చు.

టీజీఆర్‌జేసీ సెట్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు మార్చి 2026లో 10వ తరగతి పరీక్షలకు హాజరై ఉండాలి. పదో తరగతిలో ఉత్తీర్ణత పొందిన విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు మార్చి 16, 2026వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 15, 2026వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుము కింద అభ్యర్థులు రూ.200 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఇక టీజీఆర్‌జేసీ సెట్‌ ప్రవేశ పరీక్ష మే 3, 2026న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులకు ఆయా గురుకులాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో http://tgrtc.cgg.gov.in లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. లేదా 040-24734899 ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us