AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే అలా చేయాల్సిందేనని ప్రకటన..

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మోజ్తాబా ఖమేనీ తన మొదటి ప్రకటనతోనే ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశారు. అగ్రరాజ్యం అమెరికాకు అల్టిమేటం జారీ చేస్తూ.. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే అలా చేయాల్సిందేనని ప్రకటన..
Iran New Supreme Leader Mojtaba Khamenei Warns Us
Krishna S
|

Updated on: Mar 13, 2026 | 6:10 AM

Share

ఇరాన్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మోజ్తాబా ఖమేనీ, తన మొదటి ప్రకటనతోనే పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందేశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికాపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని మోజ్తాబా హెచ్చరించారు. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను వెంటనే మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘అమెరికా శాంతిని నెలకొల్పుతుందనేది ఒక అబద్ధం. వారి సైనిక స్థావరాలు ఇక్కడ కొనసాగితే దాడులు తప్పవు’’ అని ఆయన స్పష్టం చేశారు.

తండ్రి బాటలోనే ప్రతీకారం

తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యను ప్రస్తావిస్తూ మోజ్తాబా భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి మృతదేహాన్ని చూసినప్పుడు ఆయన పిడికిలి బిగించి ఉందని.. అది ఆయన దృఢత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. తన తండ్రితో పాటు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి పౌరుడి రక్తం సాక్షిగా శత్రువుల నుండి పరిహారం వసూలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఒకవేళ శత్రువు నిరాకరిస్తే, వారి ఆస్తులను నాశనం చేస్తామని హెచ్చరించారు.

యుద్ధం ముగియాలంటే మూడు షరతులు

మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఈ వివాదాన్ని ముగించడానికి మూడు ప్రధాన షరతులను తెరపైకి తెచ్చారు..

  • ఇరాన్ యొక్క సార్వభౌమత్వాన్ని గుర్తించాలి.
  • యుద్ధం వల్ల జరిగిన నష్టానికి అమెరికా, ఇజ్రాయెల్ భారీ పరిహారం చెల్లించాలి.
  • భవిష్యత్తులో ఇరాన్‌పై ఎటువంటి దాడులు జరగవని అంతర్జాతీయ సమాజం గ్యారెంటీ ఇవ్వాలి.
  • రష్యా, పాకిస్తాన్ నాయకులతో మాట్లాడిన పెజెష్కియన్, ఈ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేదే లేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

ఆర్థికంగా దెబ్బకొడుతున్న ఇరాన్

యుద్ధం ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. పెర్షియన్ గల్ఫ్‌లో షిప్పింగ్ ట్రాఫిక్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో చమురు ధరలు బ్యారెల్‌కు 100డాలర్ల మార్కును దాటేశాయి. ఆర్థికంగా ప్రపంచ దేశాలకు ఇబ్బంది కలిగించడం ద్వారా అమెరికా, ఇజ్రాయెల్‌లు తమ బాంబు దాడులను ఆపేలా ఒత్తిడి తీసుకురావడమే ఇరాన్ అసలు వ్యూహంగా కనిపిస్తోంది.

రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు మద్దతు

లెబనాన్‌లోని హిజ్బుల్లా, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్‌లోని సాయుధ సమూహాలకు మోజ్తాబా ఖమేనీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెసిస్టెన్స్ ఫ్రంట్ యోధులు ఇరాన్ వెన్నంటి ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోజ్తాబా ఖమేనీ ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరో స్థాయికి చేరుకున్నాయి. తండ్రి కంటే కఠినమైన నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తుండటంతో, అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!