AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Jobs: నిరుద్యోగులకు ఎగిరి గంతేసే వార్త.. పోలీసు శాఖలో 17 వేలకు పైగా SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు త్వరలోనే ప్రకటన!

రాష్ట్ర నిరుద్యోగులకు పోలీసు శాఖ తీపికబురు చెప్పింది. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. పోలీస్‌ విభాగంలో యేటా పెరిగిపోతున్న ఖాళీల దృష్ట్యా ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని నిర్ణయించుకుంది. యేటా క్రమం తప్పకుండా పెద్దఎత్తున నియామకాలు చేపడుతున్నప్పటికీ పదవీ విరమణ..

Govt Jobs: నిరుద్యోగులకు ఎగిరి గంతేసే వార్త.. పోలీసు శాఖలో 17 వేలకు పైగా SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు త్వరలోనే ప్రకటన!
Telangana Police Job Vacancies
Srilakshmi C
|

Updated on: Mar 13, 2026 | 8:08 AM

Share

హైదరాబాద్‌, మార్చి 13: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు పోలీసు శాఖ తీపికబురు చెప్పింది. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. పోలీస్‌ విభాగంలో యేటా పెరిగిపోతున్న ఖాళీల దృష్ట్యా ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని నిర్ణయించుకుంది. యేటా క్రమం తప్పకుండా పెద్దఎత్తున నియామకాలు చేపడుతున్నప్పటికీ పదవీ విరమణ కారణంగా ఖాళీలు భారీగా పెరుగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 2015లో దాదాపు 18 వేలు ఉద్యోగాలు, 2018లో 18,428 ఉద్యోగాలు, 2022లో 15,644 ఉద్యోగాలు పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ చేసింది. అయినప్పటికీ 2026 ఫిబ్రవరి నెలాకరు నాటికి ఆ శాఖలో దాదాపు 17 వేలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పోలీస్ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. పోలీసుశాఖలో మొత్తం పోస్టులు 95,361 ఉండగా.. ఇందులో ప్రస్తుతం 77,369 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. దాదాపు 17,992 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోలీస్ విభాగంలో సగటున ఏడాదికి ఆరు నుంచి ఏడు వేల మంది రిటైరవుతుండటంతో ఈ ఖాళీలు ఏర్పుడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

పోలీసు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మిగతా వాటికంటే అత్యంత క్లిష్టం. అభ్యర్థులకు ప్రిలిమ్స్, మెయిన్స్‌ వంటి రాత పరీక్షలతోపాటు దేహదారుఢ్య పరీక్షలు కూడా నిర్వహించాలి. ఏడాది పాటు ఈ ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుంది. దీంతో దరఖాస్తుల స్వీకరణ మొదలు ఎంపిక ప్రక్రియ వరకు కాలయాపన జరుగుతుంది. దీనితోపాటు న్యాయ వివాదాలు తోడైతే ఇక భర్తీ ప్రక్రియలో మరింత జాప్యం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం జారీ చేసే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు ఇలాంటివి షరా మామూలై పోతున్నాయి.

ఇక అన్ని అడ్డంకులు దాటి ఎంపికైన అభ్యర్ధులకు చివరిలో శిక్షణ ఇవ్వవల్సి ఉంటుంది. ఇలా మొత్తం ప్రక్రియ పూర్తి చేయడానికి ఏకంగా రెండేళ్ల సమయం పడుతుంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఒక్క ఏడాది ఆలస్యమైనా ఈ శాఖలో ఖాళీల సంఖ్య మరింత పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పోలీస్ శాఖ అధికారులు ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. ప్రభుత్వం నుంచి ఆమోదం దొరికితే పోలీసుశాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us