AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫెయిల్యూర్ అంటూ ఛీకొట్టారు.. కట్‌చేస్తే.. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌తో ఇచ్చిపడేసిన ఫ్యూచర్ స్టార్?

Shubman Gill Cricketer of the Year: టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులో చోటు దక్కకపోయినా భారత స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు పెద్ద గౌరవం దక్కనుంది. బీసీసీఐ నిర్వహించే నామన్ అవార్డ్స్‌లో ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఆయనకు లభించనుందని నివేదికలు వెల్లడించాయి. గిల్ ప్రదర్శనలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇవ్వనున్నారు.

ఫెయిల్యూర్ అంటూ ఛీకొట్టారు.. కట్‌చేస్తే.. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌తో ఇచ్చిపడేసిన ఫ్యూచర్ స్టార్?
Shubman Gill
Venkata Chari
|

Updated on: Mar 12, 2026 | 1:50 PM

Share

BCCI Naman Awards 2026: భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బీసీసీఐ ప్రతిష్టాత్మక నామన్ అవార్డ్స్‌లో ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకోనున్నట్లు సమాచారం. తన స్థిరమైన బ్యాటింగ్ ప్రదర్శనలతో గిల్ గత కొంతకాలంగా భారత జట్టుకు కీలక ఆటగాడిగా నిలుస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతని రికార్డులు, ముఖ్యంగా టెస్ట్ , వన్డేల్లో చేసిన పరుగులు ఈ అవార్డు దక్కడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

రాహుల్ ద్రవిడ్‌కు జీవిత సాఫల్య పురస్కారం..

బీసీసీఐ నామన్ అవార్డ్స్‌లో మాజీ భారత కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ‘కోల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ ఇవ్వనున్నట్లు సమాచారం. భారత క్రికెట్‌కు ఆటగాడిగా, కోచ్‌గా చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని ఆయనకు అందించనున్నారు. క్రికెట్ ప్రపంచంలో ద్రవిడ్‌కు ఉన్న గౌరవాన్ని ఇది మరోసారి నిరూపిస్తుంది.

ఇతర ఆటగాళ్లకు కూడా అవార్డులు..

ముంబైకి చెందిన యువ ఆటగాడు అయుష్ మత్రే దేశీయ లిమిటెడ్ ఓవర్ల క్రికెట్‌లో అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసినందుకు ‘లాలా అమర్‌నాథ్ అవార్డు’ అందుకోనున్నాడు. అలాగే భారత మహిళల క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్‌కు కూడా జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వాలని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

టీమిండియాకు బీసీసీఐ భారీ బహుమతి..

టీ20 వరల్డ్ కప్ 2026 విజయం తర్వాత బీసీసీఐ భారత జట్టుకు రూ.131 కోట్ల భారీ క్యాష్ రివార్డ్ ప్రకటించింది. ఇది భారత క్రికెట్ చరిత్రలో జట్టుకు ప్రకటించిన అతిపెద్ద బహుమతిగా నిలిచింది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, సెలెక్టర్లకు ఈ బహుమతి అందజేయనున్నారు.

టీ20 వరల్డ్ కప్‌లో భారత్ చారిత్రక విజయం..

అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సంజూ శాంసన్ 89 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో భారత్ మూడోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. అలాగే వరుసగా రెండోసారి టైటిల్‌ను కాపాడుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us