కొర్రమీను చేప కేవలం రుచికి మాత్రమే కాదు, పోషకాలకు కూడా ఒక పవర్‌హౌస్. ఇందులో తక్కువ కొవ్వు, అధిక ప్రొటీన్లు, ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, గాయాలను మాన్పడంలో ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా, యాంటీ డిప్రెసెంట్గానూ పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.