అనంతపురంలో మహిళలను ఎరగా వేసి అధికారులు, వ్యాపారుల నుండి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ఎనిమిది మంది హనీ ట్రాప్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఏకాంత వీడియోలతో బెదిరిస్తూ, రేప్ కేసులు పెడతామని భయపెట్టి ఈ వసూళ్లకు పాల్పడ్డారు. ఇప్పటివరకు 19 మంది బాధితులను గుర్తించారు. ఈ కేసులో పోలీసుల పాత్రపై ఎస్పీ జగదీష్ విచారణకు ఆదేశించారు.