AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson: సంజూ శాంసన్ ఇప్పటికీ జీరోనే.. టీమిండియా మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్..!

Mohammad Azharuddin on Sanju Samson: టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇందులో సంజూ శాంసన్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో టోర్నీ కీలక దశలో చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే, ఓ టీమిండియా మాజీ కెప్టెన్ మాత్రం సంజూ ప్రదర్శనపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Sanju Samson: సంజూ శాంసన్ ఇప్పటికీ జీరోనే.. టీమిండియా మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్..!
Ind Vs Nz Sanju Samson
Venkata Chari
|

Updated on: Mar 10, 2026 | 8:58 AM

Share

Mohammad Azharuddin on Sanju Samson: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించినప్పటికీ, సంజూ శాంసన్ ప్రదర్శనపై మాజీ భారత కెప్టెన్ మహ్మద్ ఆజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రారంభంలో అంచనాలకు తగ్గట్టు ఆడలేదని చెప్పినా, చివర్లో అతను గొప్పగా రాణించాడని ప్రశంసించాడు. మహ్మద్ ఆజారుద్దీన్ (Mohammad Azharuddin) టీ20 వరల్డ్ కప్ 2026 విజయానంతరం భారత జట్టును అభినందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టు (India national cricket team) వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలవడం గొప్ప విషయం అని ఆయన పేర్కొన్నాడు.

ఈ విజయంతో భారత్ 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 వరల్డ్ కప్‌ను వరుసగా గెలుచుకుని అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

ఆజారుద్దీన్ మాట్లాడుతూ, భారత జట్టు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యంత బలమైన జట్టుగా కనిపిస్తోందని చెప్పారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ లోతైన బలం ఉండటం వల్ల భారత్‌ను ఓడించడం ఇతర జట్లకు చాలా కష్టం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు.

భారత జట్టు బలం..

ఆజారుద్దీన్ ప్రకారం, భారత జట్టులో ప్రతీ విభాగంలో మంచి సమతుల్యత ఉంది. బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు బలమైన ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్‌లో కూడా వేగం, స్పిన్ రెండింటిలోనూ మంచి ఎంపికలు ఉన్నాయి.

ఎక్కువమంది చదివినది: ఫైనల్ మ్యాచ్‌కు ముందే చెల్లి చనిపోయినా.. దేశం కోసం బరిలోకి ఛోటా ప్యాకెట్..!

అయితే ఫీల్డింగ్ విషయంలో ఇంకా మెరుగుదల అవసరమని ఆయన సూచించారు. కొన్ని మ్యాచ్‌ల్లో అద్భుత క్యాచ్‌లు పట్టినా, కొన్ని సందర్భాల్లో పొరపాట్లు కూడా కనిపించాయని పేర్కొన్నాడు.

సంజూ శాంసన్ పై కీలక వ్యాఖ్యలు..

టీ20 వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచిన శాంసన్ (Sanju Samson) గురించి కూడా ఆజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాటల్లో, టోర్నమెంట్ ప్రారంభంలో శాంసన్ అంచనాలకు తగ్గట్టు ప్రదర్శన ఇవ్వలేకపోయాడని అన్నాడు. అయితే, తర్వాత అతను తన ఆటలో కీలక మార్పు తీసుకువచ్చి ఉత్కంఠ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించాడని చెప్పుకొచ్చాడు.

శాంసన్ చివరి మూడు కీలక మ్యాచ్‌ల్లో వరుసగా అర్ధశతకాలు చేసి భారత్ విజయానికి ముఖ్య కారణంగా నిలిచాడు. మొత్తం టోర్నమెంట్‌లో అతను 321 పరుగులు చేసి ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.

ఎక్కువమంది చదివినది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన మిస్టరీ స్పిన్నర్.. దెబ్బ అదుర్స్ కదూ..!

ఆజారుద్దీన్ మాట్లాడుతూ, “శాంసన్ చాలా ప్రతిభావంతుడు. కానీ విజయవంతం కావాలంటే ఎక్కువసేపు క్రీజ్‌లో ఉండటం ఎంత ముఖ్యమో ఇప్పుడు అతను అర్థం చేసుకున్నాడు” అని తెలిపాడు.

2027 వరల్డ్ కప్‌పై దృష్టి..

ఇప్పుడు భారత్ తదుపరి లక్ష్యం ఐసీసీ ప్రపంచకప్ 2027 (ICC Cricket World Cup 2027)పై ఉంటుంది. ఈ టోర్నమెంట్‌కు సౌతాఫ్రికా (South Africa), జింబాబ్వే (Zimbabwe), నమీబియా (Namibia) ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ఈ వరల్డ్ కప్ రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) వంటి భారత దిగ్గజాలకు చివరి అంతర్జాతీయ టోర్నమెంట్ కావొచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us