Seshachalam Forest: శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..
పవిత్ర తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మొండోడికోనలో చెలరేగిన మంటలు సుమారు 2 కిలోమీటర్ల మేర అరుదైన వృక్ష సంపదను, వనమూలికలను ధ్వంసం చేశాయి. అటవీ, టీటీడీ, అగ్నిమాపక శాఖల సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
పవిత్ర తిరుమల కొండల్లోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీవకోన అటవీ రేంజ్‌లోని మొండోడికోనలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు నగరాన్ని సైతం ఆందోళనకు గురిచేశాయి. ఆకాశాన్ని తాకుతున్న అగ్నికీలలు, దట్టమైన పొగను చూసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ, టీటీడీ మరియు అగ్నిమాపక శాఖకు చెందిన 50 మంది సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగారు. ఫైర్ లైన్లు ఏర్పాటు చేసి, ఫైర్ బీటర్లతో మంటలను ఆర్పేందుకు గంటల తరబడి తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో సుమారు 2 కిలోమీటర్ల మేర అరుదైన వృక్షసంపద, విలువైన వనమూలికలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల వేడికి అడవిలోని వన్యప్రాణులు ప్రాణభయంతో పరుగులు తీశాయి. అయితే, ఎర్రచందనం గిడ్డంగులకు ముప్పు కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఎట్టకేలకు అధికారులు, ఫైర్ సిబ్బంది శ్రమ ఫలించి మంటలు అదుపులోకి వచ్చాయి. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? అధిక ఉష్ణోగ్రతలకు అడవిలో దానంతట అదే నిప్పు అంటుకుందా? లేక ఆకతాయిల పనా? అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. అడవులను కాపాడుకునే విషయంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూర్యకి గుండుగీయించి ఊరేగిస్తాం.. దర్గా చిన్న పహిల్వాన్ వార్నింగ్
Weather Update: సెగలు పుట్టిస్తున్న సూర్యుడు.. అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల జనం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! తెలంగాణ లో ఉచిత బ్యాంకింగ్ కోచింగ్
Paytm: పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. లైసెన్స్ రద్దు
రాష్ట్రంలోనే తొలి ‘హెల్మెట్ బ్యాంక్’ ప్రారంభం.. ఎక్కడో తెలుసా ??
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!

