ఈపీఎఫ్ఓ తన పెన్షన్ విధానంలో కీలక మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న అధిక పెన్షన్ విధానానికి ప్రత్యామ్నాయంగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని అధికారులు అడుగులు వేస్తున్నారు. కనీస పెన్షన్ ₹1000 నుండి ₹3000కు పెంచడంతో పాటు, ఉద్యోగులందరినీ పెన్షన్ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. యజమాని వాటా 8.33%, కేంద్ర ప్రభుత్వ వాటా 1.16% యథావిధిగా కొనసాగుతాయి.