AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wanaparthy: సరదాగా వాకింగ్ చేద్దామని రాత్రి చెరువు కట్టవైపు వెళ్లారు.. తీరా అక్కడ

కృష్ణా నదిలో నీరు తగ్గడంతో వనపర్తి జిల్లా అమరచింత మండల పరివాహక గ్రామాల్లో మొసళ్ల సంచారం పెరిగింది. తాజాగా మూలమల్ల గ్రామ చెరువు కట్టపై మొసలి కనిపించడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి డీటేల్స్ కథనం లోపల తెలుసుకుందాం పదండి ...

Wanaparthy: సరదాగా వాకింగ్ చేద్దామని రాత్రి చెరువు కట్టవైపు వెళ్లారు.. తీరా అక్కడ
Crocodile Movement
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Mar 13, 2026 | 8:11 AM

Share

వనపర్తి జిల్లా అమరచింత మండలంలో మొసళ్ళ సంచారం కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవలే కృష్ణ నదిలో నీరు తగ్గడంతో… పరివాహక గ్రామాల్లో మొసళ్ళ సంచారం పెరిగిపోయింది. గ్రామాల్లోని చెరువులు, పంట పొలాల్లో మొసళ్ళు తరచూ తిరుగుతూ గ్రామస్థులు, రైతులను భయాందోళన కలిగిస్తున్నాయి.

గత రాత్రి అమరచింత మండలం మూలమల్ల గ్రామ చెరువు కట్టపై మొసలి కనిపించడంతో గ్రామస్థులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి పంటపొలాల నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో గ్రామస్థులకు మొసలి కనిపించింది. దీంతో వెంటనే మొబైల్ ఫోన్‌లో ఆ దృశ్యాలను బంధించారు. అయితే గడిచిన కొన్నేళ్లుగా ఊరి చెరువులో మొసళ్ళ సంచారంతో గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. వేకువజామున, రాత్రిళ్ళు పంటపొలాలకు వెళ్లాలంటే ఆందోళన చెందుతున్నారు.

తరచుగా బయటకు వస్తున్న మొసళ్ళు:

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, కృష్ణ నదికి సమీప ప్రాంతం కావడంతో అందులో నుంచి మొసళ్ళు బయటకు వస్తున్నాయి. పరివాహక గ్రామాల్లోని వ్యవసాయ బావులు, చెరువులను ఆవాసాలు మార్చుకుంటున్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లోనే గతంలో పదుల సంఖ్యలో మొసళ్ళు జనాలకు దర్శనమిచ్చాయి. అందులో కొన్నింటిని అధికారులు జూరాల ప్రాజెక్టులో వదిలేయగా మరికొన్ని అలాగే తిరుగుతున్నాయి. తాజాగా మూలమల్ల గ్రామ చెరువులో మొసలి సంచారంపై అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఊరి చెరువు చుట్టూ కంచె వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కరివేపాకు చెట్టుకు ఇది వేశారంటే.. సూపర్‌గా పెరుగుతుంది.. 

Follow Us