AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lion: సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా.. ఒక్క దెబ్బకు ఎముకలన్నీ మట్టిలా మారుతాయ్

అడవికి రాజైన సింహం గురించి 10 ఆసక్తికరమైన నిజాలను తెలుసుకోండి. సింహాలు రోజుకు 20 గంటలు నిద్రపోతాయి, ఆడ సింహాలు వేటాడతాయి. వాటి గర్జన 8 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. గుంపులుగా జీవించే సింహాలకు జ్ఞాపకశక్తి ఉంటుంది. తెలుపు రంగు సింహాలు చాలా అరుదు.

Lion: సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా.. ఒక్క దెబ్బకు ఎముకలన్నీ మట్టిలా మారుతాయ్
Lion
Ravi Kiran
|

Updated on: Mar 12, 2026 | 9:49 PM

Share

ఒక సింహం గర్జిస్తే దాని సౌండ్ సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు స్పష్టంగా వినిపిస్తుంది. ఇది దాని ఆధిపత్యాన్ని చాటుకోవడానికి, ఇతర సింహాలతో కమ్యూనికేట్ చేయడానికి సహాయపడుతుంది. ఒక పెద్ద సింహం సుమారు 180 కిలోల బరువు ఉంటుంది. దాని భారీ శరీరానికి తగినట్లుగానే, ఇది ఒకేసారి 40 కిలోల మాంసాన్ని సులభంగా తినగలదు. ఈ బరువు ఉన్నప్పటికీ, సింహాలు గంటకు 80 కిలోమీటర్ల అద్భుతమైన వేగంతో పరుగెత్తగలవు. ఇది వాటి వేట సామర్థ్యానికి నిదర్శనం.

సింహాలు ఎల్లప్పుడూ గుంపులలోనే నివసిస్తాయి. ఈ గుంపును కాపాడుకోవడానికి అవి ఎంతటి సాహసానికైనా సిద్ధంగా ఉంటాయి. తమ కుటుంబం కోసం ప్రాణాలను పణంగా పెడతాయి. సింహం పంజా దెబ్బ శక్తిని తక్కువ అంచనా వేయలేము. 180 కిలోల ఫోర్స్‌తో ఒక పెద్ద సుత్తితో కొడితే ఎలా ఉంటుందో, సింహం పంజా దెబ్బ కూడా అంతే బలంతో ఉంటుంది. ఈ దెబ్బకు పెద్ద జంతువులు కూడా నిస్సహాయంగా మట్టిపాలవ్వాల్సిందే. అడవికి రాజైన సింహం అనేక ఆసక్తికరమైన లక్షణాలను కలిగి ఉంది. ఈ శక్తివంతమైన జంతువు రోజులో ఎక్కువ భాగం విశ్రాంతి తీసుకుంటుంది. సుమారు 20 గంటల పాటు నిద్రపోతుంది. మిగిలిన నాలుగు గంటల్లో మాత్రమే వేటాడుతుంది. ఆశ్చర్యకరంగా, వేట పని ఆడ సింహాలదే. మగ సింహాలు తమ స్థావరాన్ని రక్షించడంలో నిమగ్నమై ఉంటాయి, అయితే వేట పూర్తయిన తర్వాత ఆహారాన్ని ముందుగా మగ సింహాలే స్వీకరిస్తాయి.

ప్రతి మగ సింహం జూలు ప్రత్యేకంగా ఉంటుంది, దాని ఆరోగ్యం, వయస్సు, బలాన్ని సూచిస్తుంది. సింహం పంజా దెబ్బ ఎముకలను విరగ్గొట్టగలదు. ఒకసారి వేటను ప్రారంభించిన తర్వాత, లక్ష్యం చేరే వరకు అవి ఆగవు. ఒక సింహం గర్జిస్తే, చుట్టుపక్కల ఉన్న ఇతర సింహాలు ఉత్సాహంతో ప్రతిస్పందిస్తాయి. సింహాలు గుంపులుగా జీవిస్తాయి, వీటిని ప్రైడ్ అంటారు, ఒక్కో ప్రైడ్‌లో 15 నుండి 30 సింహాలు ఉండవచ్చు. వాటికి జ్ఞాపకశక్తి ఉంటుంది, ఒక మనిషి ముఖాన్ని గుర్తుంచుకోగలవు. తెల్ల రంగు సింహాలు (వైట్ లైన్స్) చాలా అరుదైనవి, ప్రపంచంలో ప్రత్యేకమైనవి.

ఇది చదవండి: కూలీ పనులకు వెళ్లే రైతులకు దూరంలో మసకగా కనిపించింది.. దగ్గరకెళ్లి పరిశీలించగా

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్