రాగి పాత్రలో 8 గంటలు ఉంచిన నీరు తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు
21-06-2026
Pic credit - Instagram
Phani Ch
ఎండలు మండిపోతున్న ఈ వేసవిలో ఫ్రిజ్ నీళ్లకు బదులుగా, మన పూర్వీకులు వాడిన ఒక అద్భుతమైన సహజ పానీయం గురించి మీకు తెలుసా?
అదే రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు. ఇప్పుడు మళ్లీ ఈ ట్రెండ్ ఊపందుకుంది. కేవలం దాహం తీర్చడమే కాదు, ఈ నీరు మన శరీరానికి ఒక అమృతంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రాగి పాత్రలో కనీసం ఎనిమిది గంటల పాటు నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల, అది శరీరంలోని అధిక వేడిని లాగేసి ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది.
రాగికి సహజంగానే క్షార గుణం (alkaline nature) ఉంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణమై, మలబద్ధకం దూరం అవుతుంది.
రాగి పాత్రలోని నీరు సహజ యాంటీబయాటిక్‌గా పనిచేస్తూ, రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల నుండి మనల్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
తీవ్రమైన ఎండల కారణంగా చర్మంపై ముడతలు రావడం, ట్యాన్ అవ్వడం సహజం. రాగి నీరు శరీరంలో మెలనిన్ ఉత్పత్తికి ఎంతో సహాయపడుతుంది.
బరువు తగ్గాలని కష్టపడే వారికి రాగి నీరు ఒక వరం లాంటిది. ఇది శరీరంలోని జీవక్రియలను (metabolism) వేగవంతం చేసి, అదనపు కొవ్వును కరిగించే నేచురల్ ఫ్యాట్ బర్నర్‌లా పనిచేస్తుంది.
రాగి నీరు రాగి రక్తనాళాల విస్తరణకు తోడ్పడి, రక్త ప్రసరణను సాఫీగా సాగేలా చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచి గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది.