AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుష్ప అంటే ఆ మాత్రం ఉంటుందిగా మరి..!

పుష్ప అంటే ఆ మాత్రం ఉంటుందిగా మరి..!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 21, 2026 | 5:38 PM

Share

‘పుష్ప’ సినిమా సృష్టించిన ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ధనుష్ నటిస్తున్న ‘ఓమ్’ టీజర్‌లో అడవి, గొడ్డలి, ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం కనిపించడంతో సోషల్ మీడియాలో ‘పుష్ప’తో పోలికలు మొదలయ్యాయి. కథ వేరు అయినప్పటికీ కొన్ని విజువల్స్, మేకింగ్ స్టైల్ ‘పుష్ప’ను గుర్తు చేస్తున్నాయంటూ సినీ అభిమానులు చర్చిస్తున్నారు.

పుష్ప అంటే పేరు కాదు.. అది బ్రాండ్ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ మామూలుగా పేలలేదు. ఇండియన్ సినిమా దగ్గర పుష్ప గాడి సౌండ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈ సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు ఇతర ఇండస్ట్రీలపై కూడా పడింది. కొన్ని సినిమాల టీజర్స్ చూస్తుంటే తెలియకుండానే పుష్ప గుర్తుకొస్తున్నాడు. తాజాగా ధనుష్ సినిమాతో సహా.. మరి ఆ విషయమేంటో తెలుసా..? ఎర్రచందనం.. అడివి.. స్మగ్లింగ్.. ఈ మూడు పక్కపక్కన బెడితే ఎవరైనా చెప్పే పేరు పుష్ప. దానికి ముందు కూడా స్మగ్లింగ్‌పై సినిమాలు వచ్చాయి కానీ బన్నీ వేసిన బ్రాండ్ ముందు మిగిలిన సినిమాలేవీ కనీసం కనబడలేదు. అదేంటో గానీ పుష్ప తర్వాత ఆ తరహాలోనే మరికొన్ని సినిమాలు కూడా వస్తున్నాయి. బ్యాగ్రౌండ్ మారినా.. మేకింగ్ మాత్రం పుష్పనే గుర్తుకు తెస్తుంది. చూస్తున్నారుగా.. ఇప్పుడు మనం చూస్తున్నది పుష్ప టీజర్ కాదు ధనుష్ ఓమ్ టీజర్. ఇందులో కూడా అదే అడివి.. గొడ్డలి.. ఎర్రచందనం కనిపిస్తున్నాయి. కథ వేరే అయ్యుండొచ్చు.. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి మరో కథ చెప్పడానికి ప్రయత్నిస్తుండొచ్చు.. కానీ ఆయన మేకింగ్ మాత్రం పుష్పను గుర్తుకు తెచ్చిందనేది కాదనలేని నిజం. కొన్ని షాట్స్ సేమ్ టూ సేమ్ పుష్పలాగనే ఉన్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. మొన్నామధ్య మలయాళంలో వచ్చిన కాటలాన్ సినిమాలోనూ పుష్ప ఛాయలు కనిపించాయి. అందులో కూడా ఎర్రచందనం బదులు ఏనుగు దంతాల స్మగ్లింగ్ ఉంటుంది. మిగిలిందంతా దాదాపు పుష్ప మాదిరే ఉంటుంది. ో పెద్ద బ్లాక్‌బస్టర్ వచ్చినపుడు అలాంటి సినిమాలే వస్తుంటాయి.. ఆ మధ్య కేజీయఫ్, అర్జున్ రెడ్డిలను చూసి అలాంటి సినిమాలే కొందరు దర్శకులు ట్రై చేసారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

OTT గైడ్! వావ్.. 16 పైగా సినిమాలు స్ట్రీమింగ్‌కి

Samantha: సమంత పిల్లి పేరు వెనకాల.. ఓ జ్ఙాపకం.. ఓ కష్టం.. ఓ కన్నీటి కథ ఉంది తెలుసా?

Klin Kaara: ఫైనల్‌గా క్లీంకారను చూపించిన చరణ్‌

హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై షాకింగ్ సీన్.. స్పోర్ట్స్‌ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు!

నిండా ముంచిన ఇన్‌స్టా ప్రేమ.. లక్షల్లో నగదు, గోల్డ్‌ కొట్టేసిన కేటుగాడు

Follow Us