హీరోలకు దీటుగా విలన్స్.. అలా సెట్ అయింది..!
తెలుగు సినిమాల్లో విలన్ పాత్రల తీరు పూర్తిగా మారుతోంది. హీరోలకు ధీటుగా, కథను మలుపుతిప్పే శక్తివంతమైన ప్రతినాయక పాత్రలను దర్శకులు రూపొందిస్తున్నారు. ‘ప్యారడైజ్’లో రాఘవ్ జుయల్, ‘వారణాసి’లో పృథ్వీరాజ్ సుకుమారన్, ‘కల్కి 2’లో కమల్ హాసన్ వంటి నటులు హీరోలకు సమానమైన ప్రాధాన్యతతో కనిపించనున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సినిమాలో హీరో అంటే హీరోనే.. అందరికంటే ఆయనే గొప్ప. హీరో ఏం చేసినా రైట్ అంతే.. విలన్ ఎంత బలంగా ఉన్నా హీరో ముందు వీక్ అయిపోతాడు. కానీ ఇదంతా ఓల్డ్ ఫార్మాట్.. హీరోకు ఏ మాత్రం తీసిపోని విలన్స్ రెడీ అవుతున్నారు మన దగ్గర. ఇప్పుడిదే ట్రెండ్ కూడా. తెలుగు సినిమాల్లో విలన్స్ రూపురేఖలు మార్చేస్తున్నారు మేకర్స్. దానిపైనే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. విలన్ ఎంత పవర్ ఫుల్ అయితే హీరో అంతకంటే ఎక్కువ పవర్ ఫుల్ అవుతాడు.. రాజమౌళి ఫాలో అయ్యే ఫార్మాట్ ఇదే. ఇప్పుడిదే ట్రెండ్ చాలా మంది దర్శకులు దించేస్తున్నారు. తాజాగా ప్యారడైజ్ సినిమానే తీసుకోండి.. మామూలుగానే నాని యాక్టింగ్ అంటే ఇరగదీస్తారు.. ఆయనకు పోటీగా నిలబడాలంటే ఎవరికైనా కష్టమే. అలాంటిది బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ఈ పాత్రలో ఒదిగిపోయారు. ప్యారడైజ్‌లో ప్రతీపాత్రపై చాలా ఫోకస్ చేస్తున్నారు శ్రీకాంత్ ఓదెల. టైం తీసుకున్నా పర్లేదు కానీ ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో విక్రమ్ మాలిక్‌గా నానికి ధీటైన పాత్రలో రాఘవ్ నటిస్తున్నారు. అలాగే మోహన్ బాబు క్యారెక్టర్‌ను కూడా అంతే పవర్ ఫుల్‌గా రాసుకుంటున్నారు. శ్రీనివాస మంగాపురంలోనూ హీరోకు డామినేట్ చేసేలా కనిపిస్తున్నారు కలెక్షన్ కింగ్.వారణాసిలోనూ అంతే.. ముందు నుంచి చెప్తున్నట్లుగానే హీరోకు ధీటుగా ఉండే ప్రతినాయక పాత్రను పృథ్వీరాజ్ సుకుమారన్ రూపంలో చెక్కుతున్నారు రాజమౌళి. కుంభాగా విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతున్నారు ఈ మలయాళ స్టార్. అలాగే సలార్ 2లోనూ ప్రభాస్‌కు ధీటైన పాత్రలో నటిస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ రెండింట్లోనూ ఈయన పాత్ర కీలకమే. హీరో, విలన్ అనే టాపిక్ వస్తే.. కల్కిని ఎలా మిస్ అవుతాం చెప్పండి..? ఇందులో ఏకంగా లోక నాయకుడు కమల్ హాసనే విలన్‌గా నటిస్తున్నపుడు ఆ రేంజ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కల్కిలో కనిపించేది నిమిషాలే అయినా.. ఆ పాత్ర ఇంపాక్ట్ మామూలుగా లేదు. కల్కి 2లో యస్కిన్‌గా కమల్ విశ్వరూపం కనిపించబోతుంది. మొత్తానికి విలన్‌నే హీరో రేంజ్‌లో చూపిస్తున్నారు మన మేకర్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళ చితాభస్మంలో కత్తెర.. అసలేం జరిగింది?
OTT గైడ్! వావ్.. 16 పైగా సినిమాలు స్ట్రీమింగ్‌కి
Samantha: సమంత పిల్లి పేరు వెనకాల.. ఓ జ్ఙాపకం.. ఓ కష్టం.. ఓ కన్నీటి కథ ఉంది తెలుసా?
Klin Kaara: ఫైనల్‌గా క్లీంకారను చూపించిన చరణ్
హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై షాకింగ్ సీన్.. స్పోర్ట్స్ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు!
మహిళ చితాభస్మంలో కత్తెర.. అసలేం జరిగింది?
నిండా ముంచిన ఇన్‌స్టా ప్రేమ..
ఇళ్లలో ఉక్కపోత.. బీచ్‌లో హాయినిద్ర! ప్రజల వినూత్న పరిష్కారం వైరల్
వీపుపై భార్య.. న్యాయం కోసం పోరాటం!
క్యాన్లలో పెట్రోల్ నింపి.. బైక్‌లకు కట్టుకుని..
ఇంట్లో నుంచి పారిపోయిన జంటకు హైకోర్టులో షాక్
సముద్రంలో శ్మశానవాటిక.. ఎవరిదో తెలుసా!

