AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కారుకు 4 టైర్లు మాత్రమే ఎందుకు ఉంటాయి..? దీని వెనుకున్న క్రేజీ సైన్స్ ఇదే..

కార్ల డిజైన్, వాటి పరిణామ క్రమం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. మనం నిత్యం వాడే కార్లకు నాలుగు చక్రాలు ఉండటం వెనుక కేవలం ఒక డిజైన్ మాత్రమే కాదు.. అంతకుమించిన భద్రత, స్థిరత్వం, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అసలు కార్లకు నాలుగు చక్రాలే ఎందుకు పర్ఫెక్ట్ ఛాయిస్? 3, 5 టైర్లు ఎందుకు ఉండవు..? అనేది తెలుసుకుందాం..

కారుకు 4 టైర్లు మాత్రమే ఎందుకు ఉంటాయి..? దీని వెనుకున్న క్రేజీ సైన్స్ ఇదే..
Why Do Cars Have 4 Wheels
Krishna S
|

Updated on: Jun 21, 2026 | 7:46 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ కోట్ల కొద్దీ కార్లు, బస్సులు, బైక్‌లు రోడ్లపై తిరుగుతుంటాయి. ముఖ్యంగా నాలుగు చక్రాల వాహనాలైన కార్ల ప్రయాణం మనకు ప్రత్యేకమైన ఫీలింగ్ ఇస్తుంది. ప్రతి ఒక్కరు కారు కొనాలి అని అనుకుంటారు. చాలా మంది డబ్బులు లేక వెనకడుగు వేస్తుంటారు. అయితే కార్ల గురించి కొన్ని విషయాలు చాలా మందికి తెలియవు. ముఖ్యంగా కార్లకు నాలుగు టైర్లు మాత్రమే ఎందుకు ఉంటాయి..? 3, 5 టైర్లు ఎందుకు ఉండవు అనే డౌట్ చాలా మంది వస్తుంది..? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..

నాలుగు చక్రాలే ఉండటానికి ప్రధాన కారణాలు

కార్లు సాధారణంగా చతురస్రాకారం లేదా దీర్ఘచతురస్రాకార డిజైన్‌లో ఉంటాయి. కారు స్థిరంగా ఉండాలంటే దాని మొత్తం బరువు నాలుగు మూలల్లో సమానంగా ఉండడం చాలా ముఖ్యం. నాలుగు టైర్లు కారు బరువును పర్ఫెక్ట్‌గా సమతుల్యం చేస్తాయి. కారుకు నాలుగు టైర్లు ఉన్నప్పుడే అది రోడ్డుపై మంచి పట్టు సాధిస్తుంది. ముఖ్యంగా వేగంగా వెళ్తూ మలుపులు తిరిగేటప్పుడు, సడన్ బ్రేకులు వేసేటప్పుడు కారు అదుపు తప్పకుండా సురక్షితంగా ఉండటానికి నాలుగు టైర్ల డిజైన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ మూడు టైర్లే ఉంటే కారు బ్యాలెన్స్ కోల్పోయి పల్టీలు కొట్టే ప్రమాదం ఉంది. ఐదు లేదా ఆరు చక్రాలు పెడితే అనవసరంగా ఖర్చు, బరువు పెరిగి మైలేజ్ తగ్గిపోతుంది.

కార్ల పరిణామ క్రమం.. రథాల నుండి ఆధునిక కార్ల వరకు

మానవ చరిత్రలో చక్రం కనుగొనడం ఒక పెద్ద మలుపు. నాటి కాలంలో రాజులు వాడే రథాలకు కూడా నాలుగు చక్రాలే ఉండేవి. ఆ తర్వాత ఆటోమొబైల్ రంగం ఎలా రూపాంతరం చెందిందంటే..

1769: నికోలస్ జోసెఫ్ కుగ్నోట్ అనే శాస్త్రవేత్త ప్రపంచంలోనే మొదటి ఆటోమేటిక్ వాహనాన్ని నిర్మించారు.

1801: రిచర్డ్ ట్రెవిథిక్ ఆవిరి యంత్రాన్ని ఉపయోగించి రోడ్డుపై నడిచే వాహనాన్ని తయారు చేశారు.

1885: కార్ల్ బెంజ్ మొదటి ఆచరణాత్మక కారును నిర్మించారు. ఇది ఆధునిక కార్ల తయారీకి పునాది వేసింది.

1908: హెన్రీ ఫోర్డ్ ప్రసిద్ధ మోడల్ టి కారును మార్కెట్లోకి తెచ్చారు. అసెంబ్లీ లైన్ విధానం ద్వారా కార్లను సామాన్యులకు సైతం అందుబాటు ధరలో తయారు చేయవచ్చని ఆయన నిరూపించారు.

ఫోర్ వీల్ డ్రైవ్ టెక్నాలజీ ఎప్పుడు వచ్చింది?

కారులోని నాలుగు టైర్లకు సమానంగా ఇంజన్ పవర్ సరఫరా అయ్యే సాంకేతికతనే ఫోర్ వీల్ డ్రైవ్ అంటారు. ప్రారంభంలో దీనిని కేవలం భారీ యంత్రాలు, సైనిక వాహనాల కోసమే వాడేవారు.

1893: బ్రామా జోసెఫ్ డిప్లాక్ మొదటి 4WD సిస్టమ్‌కు పేటెంట్ పొందారు.

1900: ప్రముఖ ఆటోమొబైల్ డిజైనర్ ఫెర్డినాండ్ పోర్షే ఎలక్ట్రిక్ మోటార్ సహాయంతో నడిచే మొదటి ఫోర్ వీల్ డ్రైవ్ వాహనాన్ని సృష్టించారు.

1902: డచ్ దేశానికి చెందిన స్పైకర్ సోదరులు పూర్తిగా మెకానికల్ పద్ధతిలో పనిచేసే 4WD వాహనాన్ని డెవలప్ చేశారు. నాడు రక్షణ రంగంలో ఎక్కువగా వాడిన ఈ టెక్నాలజీ, నేడు సాధారణ కార్లలో కూడా లభిస్తోంది.

భద్రత, స్థిరత్వం, మెరుగైన రోడ్ పట్టు, ఆర్థిక పొదుపు పరంగా చూసుకుంటే కార్లకు నాలుగు చక్రాల డిజైనే ప్రపంచవ్యాప్తంగా పర్ఫెక్ట్ ఆప్షన్‌గా నిలిచింది. ప్రాచీన రథాల కాలం నుండి నేటి ఆధునిక ఈవీ కార్ల వరకు నాలుగు చక్రాల కాన్సెప్ట్ అనేది కేవలం ఒక డిజైన్ మాత్రమే కాదు.. దాని వెనుక ఎంతో పక్కా సైన్స్ దాగుంది.

Follow Us